Naga shaurya -NTR Mother: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగశౌర్య మరి కొద్ది రోజులలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారనీ తెలుస్తోంది. కర్ణాటక, మంగళూరు కుందాపూర్ గ్రామానికి చెందిన అనూష శెట్టి అనే ఇంటీరియర్ డిజైనర్ ను నాగశౌర్య ఈనెల 20వ తేదీ వివాహం చేసుకోబోతున్నారు.
ఈ క్రమంలోనే నాగశౌర్య పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా తాను చేసుకోబోయే అమ్మాయి గురించి కూడా అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమెఇంటీరియర్ డిజైనర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ది బెస్ట్ డిజైనర్ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు.
ఇకపోతే ఒకానొక సమయంలో నాగశౌర్యకు అనూష శెట్టి తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఈ జంట పెద్దల సమక్షంలో ఈ నెల 20వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇకపోతే ఈ విషయం తెలిసినటువంటి ఎంతోమంది అభిమానులు అనూష శెట్టికి ఎన్టీఆర్ తల్లికి సంబంధం ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా వీరి రిలేషన్ గురించి బయట పెడుతున్నారు.
ఇక ఎన్టీఆర్ తల్లికి ఉన్న సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే అనూష శెట్టి మంగుళూరులోని కుందాపూర్ గ్రామానికి చెందిన అమ్మాయి. అదేవిధంగా ఎన్టీఆర్ తల్లి కూడా కర్ణాటకకు చెందిన వ్యక్తి అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె కూడా కుందాపూర్ గ్రామానికి చెందిన అమ్మాయి కావడం విశేషం అలా వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారని తెలుస్తోంది. ఇక నాగశౌర్యకు ఎన్టీఆర్ కుటుంబంతో కూడా మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…