అక్టోబర్ 10వ తేదీ జరిగే ఎన్నికల గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.మా ఎన్నికలు ఏకంగా సాధారణ అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఇరువురు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ ప్రస్తుత మా అధ్యక్షుడుగా ఉన్నటువంటి సినీ నటుడు నరేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.
నాగబాబు మా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రైటర్స్, డైరెక్టర్స్ భవనం పక్కనే ఉన్నటువంటి స్థలాన్ని 45 లక్షలకు కొనుగోలు చేసి, దానికి ఫర్నిషింగ్ చేసేందుకు అంతా కలిపి 95 లక్షల వరకు ఖర్చు అయ్యిందని నాగబాబు పేర్కొన్నారు. ఆ తరువాత మా అధ్యక్షులుగా ఉన్న వారు ఆ భవనాన్ని అద్దెకు ఇచ్చారని, వారి తర్వాత మా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నరేష్ ఆ భవనాన్ని చాలా తక్కువగా కేవలం 35 లక్షలకే ఆ భవనాన్ని అమ్మినట్లు ఆరోపించారు.
డైరెక్టర్స్ రైటర్స్ తో నటీనటులకు మంచి ర్యాంపో ఏర్పడుతుందన్న ఉద్దేశంతోనే ఆ భవనాల పక్కనే మా భవనాన్ని నిర్మించగా దానిని అత్యంత తక్కువ ధరకే అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందని.. ఈ విషయంపై నరేష్ సమాధానం చెప్పాలని నాగబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాగబాబు మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న సమయంలో వారు మంచు కుటుంబాన్ని మద్దతు కోరలేదని, ఇప్పుడు కూడా మంచు కుటుంబం వీరి మద్దతు కోరలేదని తెలియజేశారు.
ఇకపోతే ముందు నుంచి మా అధ్యక్షుడు పదవికి పోటీ చేయమని ప్రకాష్ రాజ్ కు మేమే చెప్పమని ప్రకాష్ రాజ్ పోటీలో నిలబడిన తరువాత మంచు విష్ణు పోటీ చేస్తున్నారని ఈ సందర్భంగా నాగబాబు క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ తాను ప్రకాష్ రాజ్ కే మద్దతు తెలుపుతున్నామని ఈ సందర్భంగా నాగబాబు ఓపెన్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…