“మా” స్థలాన్ని అమ్మాల్సిన అవసరం ఏమిటి.. మా మద్దతు ప్రకాష్ రాజ్ కి అంటూ ఓపెన్ అయిన నాగబాబు!

0
168

అక్టోబర్ 10వ తేదీ జరిగే ఎన్నికల గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.మా ఎన్నికలు ఏకంగా సాధారణ అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఇరువురు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ ప్రస్తుత మా అధ్యక్షుడుగా ఉన్నటువంటి సినీ నటుడు నరేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

నాగబాబు మా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రైటర్స్, డైరెక్టర్స్ భవనం పక్కనే ఉన్నటువంటి స్థలాన్ని 45 లక్షలకు కొనుగోలు చేసి, దానికి ఫర్నిషింగ్‌ చేసేందుకు అంతా కలిపి 95 లక్షల వరకు ఖర్చు అయ్యిందని నాగబాబు పేర్కొన్నారు. ఆ తరువాత మా అధ్యక్షులుగా ఉన్న వారు ఆ భవనాన్ని అద్దెకు ఇచ్చారని, వారి తర్వాత మా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నరేష్ ఆ భవనాన్ని చాలా తక్కువగా కేవలం 35 లక్షలకే ఆ భవనాన్ని అమ్మినట్లు ఆరోపించారు.

డైరెక్టర్స్ రైటర్స్ తో నటీనటులకు మంచి ర్యాంపో ఏర్పడుతుందన్న ఉద్దేశంతోనే ఆ భవనాల పక్కనే మా భవనాన్ని నిర్మించగా దానిని అత్యంత తక్కువ ధరకే అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందని.. ఈ విషయంపై నరేష్ సమాధానం చెప్పాలని నాగబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాగబాబు మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న సమయంలో వారు మంచు కుటుంబాన్ని మద్దతు కోరలేదని, ఇప్పుడు కూడా మంచు కుటుంబం వీరి మద్దతు కోరలేదని తెలియజేశారు.

ఇకపోతే ముందు నుంచి మా అధ్యక్షుడు పదవికి పోటీ చేయమని ప్రకాష్ రాజ్ కు మేమే చెప్పమని ప్రకాష్ రాజ్ పోటీలో నిలబడిన తరువాత మంచు విష్ణు పోటీ చేస్తున్నారని ఈ సందర్భంగా నాగబాబు క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ తాను ప్రకాష్ రాజ్ కే మద్దతు తెలుపుతున్నామని ఈ సందర్భంగా నాగబాబు ఓపెన్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here