మెగా ఫ్యామిలీ వర్సస్ మంచు ఫ్యామిలీ.. ఈ రెండు కుటుంబాల మధ్య పరస్పర అభిప్రాయ బేధాలు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోని ఇరు కుటుంబాల మధ్య ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటి వరకూ నాగబాబు.. మోహన్ బాబు.. విష్ణు ల కామెంట్లు చూసాం.. గత కొద్దిరోజులుగా వాళ్ళు సైలెంట్ అయిపోయారు.
అయితే తాజగా శ్రీ విద్యానికేతన్ 30వ వార్షికోత్సవం సందర్భంగా మంచు మనోజ్ పరోక్షంగా నాగబాబుపై సెటైర్లు వేశారు. మా ఎలక్షన్స్ సందర్బంగా మంచు విష్ణుపై నాగబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ మనోజ్ మండిపడ్డారు. నాగబాబుకు హైయ్యర్ పర్పస్ లేదని అందువల్లే తమతో గొడవలు పడుతున్నాడని పరోక్షంగా కామెంట్ చేసాడు. దీనితో మరోసారి నిప్పురాజుకుంది.
ఈ నేపధ్యంలో హైయర్ పర్పస్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిపై విపరీతంగా ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇక తాజగా ఈ వ్యాఖలపై నాగబాబు కూడా స్పందించారు. తాజగా “ఆస్క్ మీ..” పేరిట తన ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ నేపద్యంలో ఓక అభిమాని.. ‘‘ఇన్ని రోజుల తర్వాత ఆస్క్ మీ పెట్టడానికి కారణం ఏంటి సార్?’’ అంటూ ప్రశ్నించారు. దీనిపై నాగబాబు స్పందిస్తూ ‘‘హైయర్ పర్పస్ కోసం’’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మంచు మనోజ్ వ్యాఖ్యలకు కౌంటర్ గానే నాగబాబు అలా వ్యాఖ్యానించారని భావిస్తున్నారు. అయితే ఇది ఇంతటితో ఆగుతుందా లేదా అనేది వేచి చూడాలి..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…