మెగా బ్రదర్స్ లో నిర్మొహమాటంగా ఏదైనా మాట్లాడే వ్యక్తిగా నాగబాబు కనిపిస్తారు. గతంలో తన ఫ్యామిలీ జోలికివచ్చిన ఎవరిని కూడా నాగబాబు అంత ఊరికే వదిలిపెట్టలేదు.. బుల్లితెర రారాజు గా పది సంవత్సరాలు ఏలిన నాగబాబు ఇప్పటికీ టీవీ షోలతో బిజీగా ఉంటున్నారు.. ఇక మాటల్లో వెటకారం జోడించి మాట్లాడటంలో నాగబాబు దిట్ట. ఈ నేపధ్యంలో కొన్ని వివాదాలు కూడా కొనితెచ్చుకుంటారు మెగా బ్రదర్. తాజాగా సోషల్ మీడియాలో అయన అభిమానులతో చిట్ చాట్ నిర్వచించారు నాగబాబు.
ఈ క్రమంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు అయన మార్క్ వెటకారం, హాస్యం జోడించి తనదైన శైలిలో జవాబులు ఇచ్చారు. ఈ నేపధ్యంలో ఒక అభిమాని “నాగబాబు అంకుల్ నిహారిక అక్క ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఏమయింది? ఎందుకు డిలీట్ చేసింది ? ఆమె పై వచ్చిన రూమర్స్ మీద మీరు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్” అంటూ ప్రశ్నలు సంధించారు.
దీనిపై నాగబాబు స్పందిస్తూ “నిజానికి నేనే కోడింగ్ నేర్చుకుని నేనే హ్యాక్ చేసి అకౌంట్ డియాక్టివేట్ చేసాను. మళ్ళి డీకోడింగ్ నేర్చుకుని రీయాక్టివేట్ చేస్తాను..” అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు.. గతకొన్ని రోజుల క్రితం నిహారిక తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను డెలీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. జిమ్ లో నిహారిక ఒక వీడియో షేర్ చేసింది. దానిపై విపరీతమైన నెగటివ్ కామెంట్స్ వచ్చాయట. అందువల్లె ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిందంటూ ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి..
నిహారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయడానికి కారణం ఇదేనా.. లేక వేరే ఏమయినా కారణాలు ఉన్నాయా అనే విషయంపై ఇప్పటికీ మెగా కాంపౌండ్ నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు. ఈ నేపధ్యంలో నాగబాబు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నాగబాబు కూడా అసలు విషయాన్ని పక్కనపెట్టి ఫన్నీ అన్సర్ ఇచ్చి కఫ్యూజ్ చేసారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…