Featured

Expensive cars in Tollywood: జక్కన్న నాగ చైతన్య ఇద్దరు ఒక విషయంలో కామన్ అదేంటో తెలుసా…!

Expensive cars in Tollywood : సినిమా సెలబ్రిటీస్ అనగానే వారు వాడే విలాసవంతమైన వస్తువులపై ఎక్కువ ఫోకస్ చేస్తారు జనాలు.ఎక్కువగా వాళ్ళు వాడే కారుల గురించి ఆరా తీస్తుంటారు. ఇప్పుడు కూడా అలాంటి చర్చే మళ్ళీ తెర పైకి వచ్చింది. ఇటీవలే నాగచైతన్య కారు అద్దాలకు ఫుల్ బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు కారుకు జరిమానా విధించారు. ఇక ఈ ఇష్యూలో జనాలు నోటీసు చేసింది మాత్రమే నాగచైతన్య వాడుతున్న కారేంటి అని.ఇక దర్శక ధీరుడు రాజమౌళి కూడా వాడే కారు అదేనట.ఇంతకీ అదేం కారో తెలుసా…టయోటా వెల్‌ఫైర్ ఇది పూర్తిగా లగ్జరీ ఎమ్ పి వి కారు.

అంత స్పెషల్ ఈ కారులో ఏముందో….

టయోటా వెల్‌ఫైర్ కారు విలాసవంతమైన మరియు విశాలమైన కారు. ఇక ఈ కారులో సేఫ్టీ ఫీచర్స్ కూడా సూపర్. అందుకే ఈ కారు అంత స్పెషల్ ఇక ఈ కారులో మొత్తం మూడు వరుసల్లో సీట్లు ఉంటాయి. ఇవి ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లో ఉండే ఛైర్‌లను తలపిస్తాయి. వెల్‌ఫైర్ లోని డ్రైవర్, ప్యాసింజర్ సీట్లు, 2వ వరుసలో సీట్లలో స్ప్లిట్ సన్‌రూఫ్, ఆర్మ్‌రెస్ట్, సాఫ్ట్ రీడింగ్ లైట్, సీట్ పొజిషన్‌లను సర్దుబాటు చేయడానికి రిమోట్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వెనుక ప్రయాణీకుల ఎంటర్‌టైన్మెంట్ కోసం స్క్రీన్, JBL ఆడియో సిస్టమ్, ప్రైవసీ స్క్రీన్‌లు ఉన్నాయి. ఇక ఈ కార్లలోని సీట్లు వెనక్కి కదులుతాయి. అలాగే కాళ్లను విశ్రాంతిగా పెట్టుకునేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. డిక్కీలో లగేజీ కోసం అదనపు స్థలాన్ని పొందడానికి మూడవ వరుస సీట్లను పూర్తిగా మడిచివేయొచ్చు. ప్రమాదం జరిగినప్పుడు లోపల ఉన్నవారిని సురక్షితంగా ఉంచడానికి ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

ABS, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్‌లు,పానిక్ బ్రేకింగ్ పరిస్థితులలో సహాయపడతాయి. ట్రాక్షన్ కంట్రోల్, స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్‌ కూడా ఈ కారులో ఉంది. వ్యాన్‌ను తలపించే ఈ కారును పార్క్ చేయడం కూడా సులభమే. ఇందుకు పార్కింగ్ సెన్సార్‌లతో పాటు 360-డిగ్రీ కెమెరా కూడా ఉంటుంది. కారు విశాలంగా ఉండటం వల్ల ప్రయాణికులకు తగినంత లెగ్‌రూమ్, హెడ్‌రూమ్, లంబార్ సపోర్ట్‌ను లభిస్తుంది. కారు సెల్ఫ్ -ఛార్జింగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు ఈ కారు ప్రత్యేకత. చిన్న బటన్ నొక్కితే చాలు కారు డోర్లు వాటికవే తెరుచుకుంటాయి. ఇది ఎలక్ట్రిక్ + పెట్రోల్‌తో నడిచే హైబ్రిడ్ కారు. మైలేజీ లీటర్‌కు 16.35 కిమీలు వరకు ఇస్తుందట. వెల్‌ఫైర్ కారు మొత్తం పొడవు 4935mm, వెడల్పు 1850mm, ఎత్తు 1895mm. ఇది DRLలతోపాటు ఆటోమేటిక్ LED హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నా ఈ కారు ధర ఎంతో తెలుసా అక్షరాలా 87 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు ఉంది. ఇక ఆన్ రోడ్ ధరైతే 1కోటి 11లక్షలు మాత్రమే. ఆస్తులమ్మినా మనలాంటి వాళ్లు ఇలాంటి కారును కొనలేరేమో.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago