Movie News

Nagachaitanya: నన్ను ఆదరించండి ప్లీజ్… అభిమానులను రిక్వెస్ట్ చేసుకుంటున్న నాగచైతన్య!

Nagachaitanya: అక్కినేని నాగచైతన్య ఫస్ట్ డే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా విడుదలకు మరొక రెండు రోజులు మాత్రమే గడువుంది. ఈ క్రమంలోని పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో తమిళంలో కూడా భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చెన్నైలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఇందులో చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నాగచైతన్య మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు. ఇక ఈ వేడుకలో నాగచైతన్య మొత్తం తమిళంలో మాట్లాడటం విశేషం.నాగచైతన్య తల్లి చెన్నైలో ఉండటం వల్ల ఈయనకు తమిళ భాష బాగా వచ్చు దీంతో మొత్తం తమిళంలో మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా నాగచైతన్య కస్టడీ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని తెలియజేశారు. ఇక తమిళ అభిమానుల నుంచి తనకు ఈ స్థాయిలో ఆదరణ వస్తుందని అసలు ఊహించలేదని చైతన్య తెలియజేశారు.ఇక తమిళంలో తనకి ఇది మొదటి సినిమా అని ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూసి నన్ను తమిళ ఇండస్ట్రీలో ఆదరించండి అంటూ ఈయన అభిమానులను రిక్వెస్ట్ చేసుకున్నారు.

Nagachaitanya: కస్టడీ అందరికీ నచ్చుతుంది…


ఇకపోతే నాగచైతన్య కృతి శెట్టి గురించి మాట్లాడుతూ తను నాకన్నా సీనియర్ ఇది తనకు రెండో తమిళ సినిమా అంటూ నాగచైతన్య కృతి శెట్టి గురించి తెలిపారు.ఇక ఈమె ఇదివరకే లింగు స్వామి దర్శకత్వంలో వచ్చిన దివారియర్ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం నాగచైతన్య సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

11 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

12 hours ago

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…

12 hours ago

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…

12 hours ago

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

14 hours ago

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…

15 hours ago