Nagarjuna: అక్కినేని వారసుడు అక్కినేని అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కినేని నాగార్జున వారసుడిగా ‘ అఖిల్ ‘ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్ ఇప్పటివరకు సాలిడ్ హిట్ అందుకోలేదు. ఇక ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.
ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏప్రిల్ 23న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. వరంగల్‌లోని రంగలీలా మైదానంలో ఏజెంట్ ప్రీ రీలిజ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు అక్కినేని నాగార్జున చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు.
ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అఖిల్ గురించి నాగార్జున ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ..” ‘అఖిల్ ఎనర్జీ గురించి ఎంత చెప్పినా తక్కువేనని, తను వాళ్లమ్మ కడుపులో ఉండగానే.. తన ఎనర్జీ లెవల్స్ ఏంటో మాకు చూపించాడని తెలిపాడు. అఖిల్ కి 8 నెలల వయసు ఉన్నపుడే విపరీతమైన ఎనర్జీ ఉండేదని.. పడుకోకుండా ఎప్పుడూ పరుగెత్తుతూ ఉండేవాడు. దాంతో మేం కంగారు పడి.. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే.. ఆయన అఖిల్‌ను సాయిల్ మీద పడుకోబెట్టమని సలహా ఇచ్చారు.
అలా తనలోని ఎనర్జీని బయటకు లాగాలని డాక్టర్ సూచించారని నాగర్జున తెలిపాడు. ఈ సినిమాలో కూడా అఖిల్ ఎనర్జీని డైరెక్టర్ సురేందర్ రెడ్డి అలానే బయటకు తీశారు అంటూ అఖిల్ ఎనర్జీ గురించి నాగార్జున ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇలా అఖిల్ గురించి నాగార్జున చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…