Nagma – Soundharya : సినీ పరిశ్రమలో కొంతమంది హీరోయిన్స్ కలిసి నటిస్తే ఆ సినిమాలు హిట్, సూపర్ హిట్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సావిత్రి-జమున, జయసుధ-జయప్రద, రాధా- విజయశాంతి అలా ఈ హీరోయిన్స్ కలిసి నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. కానీ 1990’s లో విడివిడిగా వచ్చిన నగ్మా, సౌందర్యల చిత్రాలు విజయవంతమైనప్పటికీ వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఈ విధంగా ప్రదర్శింపబడ్డాయి.

“రిక్షావోడు” 1995 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. చిరంజీవి, నగ్మా, సౌందర్య ఇందులో ప్రధాన పాత్రధారులు. చిరంజీవి ఇందులో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు.
రాజు (చిరంజీవి) తన బామ్మ (మనోరమ) తో కలిసి ఉపాధి కోసం పట్నానికి వస్తాడు. ఓ రిక్షా కార్మికుడి (బ్రహ్మానందం) సాయంతో రిక్షాలు అద్దెకిచ్చే నరసక్క (సౌందర్య) దగ్గర ఒక రిక్షా అద్దెకు తీసుకుని నడుపుతుంటాడు. జి. కె. రావు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నిస్తుంటాడు. అతని కూతురు రాణి (నగ్మా) గర్విష్టి. ఒక రోజు నిర్లక్ష్యంగా కారు తోలి రాజు రిక్షాను గుద్దేస్తుంది. రాజు ఆమెపై కోర్టులో కేసు వేస్తాడు. కానీ జి. కె. రావు బలం వల్ల ఆ కేసు ఓడిపోతాడు. రాజు మాత్రం అప్పుడప్పుడూ రాణి తో చిన్న కొట్లాటలు పెట్టుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ అంశం.

కె. మురళి మోహన్ రావు దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేష్ బాబు నిర్మించిన 1994 నాటి యాక్షన్ చిత్రం సూపర్ పోలీస్. ఎఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో వెంకటేష్, నగ్మా, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను అదే పేరుతో తమిళంలోకి అనువదించారు. దీనిని 1997 లో ఖేల్ ఖిలాడి కా అని హిందీలోకి అనువదించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నమోదైంది.

విజయ్ ( వెంకటేష్ ) నిజాయితీగల పోలీసు ఇన్స్పెక్టర్. అతని గత ప్రేయసి భారతి ( సౌందర్య ) అనే జర్నలిస్టు రోడ్డు ప్రమాదంలో మరణిస్తుంది. ఆ రోజు నుండి, అతను తాగుబోతు అయ్యాడు. విజయ్ ఒక జర్నలిస్ట్ రేణుక ( జయసుధ ) ఇంటికి అద్దెకు వస్తాడు, ఆమె తన భర్త ఎస్.పి.ప్రకాష్ ( అహుతి ప్రసాద్ ) నుండి, అతడి అనైతిక ప్రవర్తన కారణంగా, విడాకులు తీసుకుని, ఆమె ముగ్గురు పిల్లలతో నివసిస్తూంటుంది. ఆ తర్వాత సినిమా అనేక మలుపులు తిరిగి ముగుస్తుంది. ఇలా నగ్మా సౌందర్య కలిసి నటించిన సూపర్ పోలీస్, రిక్షావోడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర పరాజయాన్ని పొంది నిర్మాతలకు నష్టం తెచ్చిందని చెప్పవచ్చు.





























