Nandamuri Balakrishna : నందమూరి నట వారసుడిగా తెలుగు సినిమాలలో ప్రస్థానం మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు టాప్ హీరోలలో ఒకరిగానే కొనసాగుతున్నారు. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాస్తున్నాడు. సినిమాలతో పాటు ఒకవైపు రాజకీయాలు, మరోవైపు బసవతారకం హాస్పిటల్ ఇలా అన్నింటినీ సమర్థవంతంగా ముందుకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా ఆయన 107వ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతోంది. అయితే ఇప్పటివరకు 106 చిత్రాలలో చాలా మంది నటీ నటులతోను హీరోయిన్లతోను నటించినా ఆయనకు ఇద్దరు హీరోయిన్లు అంటేనూ.. వారితో నటించడం అంటేనూ ఇష్టమట.
బాలయ్య మెచ్చిన హీరోయిన్లు…
ఇప్పటికి బాలకృష్ణ కు జోడిగా చాలా మంది హీరోన్లు తెర మీద కనిపించారు. అయితే బాలకృష్ణ తో కలసి నటించిన హీరోయిన్లలో తనకు బాగా కంఫర్ట్ గా అనిపించి, వారితో ఇంకో సినిమాలో కూడా చేయాలి అనుకునే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని బాలయ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో కాదు… ఒకరు సిమ్రాన్ ఇంకొకరు నయనతార. వీళ్లిద్దరితో సినిమాలు చేయడం కంఫర్టబుల్ గా అనిపిస్తుందట.
బాలకృష్ణ సిమ్రాన్ జోడిల గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి జోడితో బొమ్మ పడితే అది బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచేవి. ఆన్ స్క్రీన్ మీద వీళ్ళ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరేది. సిమ్రాన్ తరువాత అంతలా బాలకృష్ణ సరైన జోడిగా అనిపించింది నయనతార. సింహ సినిమాలో వీరిద్దరి నటన, వీరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోయాయి. తరువాత ఏ హీరోయిన్స్ తోను బాలయ్య జంట అంతగా సెట్ అవ్వలేదనే చెప్పాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…