Nandamuri Tarakaratna: నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుతో అనారోగ్యం పాలైన సంగతి అందరికీ తెలిసిందే. గత నాలుగు రోజులుగా తారకరత్న ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇటీవల నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అకస్మాత్తుగా గుండెపోటు రావడం వల్ల అనారోగ్యం పాలయ్యాడు. దీంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రతిమ చికిత్స చేయించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నందమూరి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా నందమూరి తారకరత్న మహిళా అనారోగ్యం పాలవటంతో ప్రస్తుతం ఆయన కుటుంబానికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవటానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. నందమూరి తారక రామారావు కుమారుడైన నందమూరి మోహనకృష్ణ కుమారుడే ఈ నందమూరి తారకరత్న.
తారకరత్న 2012లో అలేఖ్య రెడ్డి అనే యువతని వివాహం చేసుకున్నాడు. అలేఖ్య రెడ్డి మరెవరో కాదు ఎంపీ విజయసాయిరెడ్డి మరదలి కూతురే ఈ అలేఖ్య రెడ్డి. స్నేహితుల ద్వారా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరి పెళ్లికి ఇర కుటుంబ సభ్యులు నిరాకరించటంతో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. విజయసాయిరెడ్డి వీరి వివాహానికి మద్దతుగా నిలిచాడని గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అలేఖ్య రెడ్డి వెల్లడించింది.
వీరి వివాహం తర్వాత ఇటు నందమూరి కుటుంబ సభ్యులకు కూడా కొంతకాలం తారకరత్నని దూరం పెట్టారు. ఎందుకంటే తారకరత్న వివాహం చేసుకున్న అలేఖ్య రెడ్డికి గతంలోనే ఒకసారి వివాహం జరిగి విడాకులు తీసుకుంది. అందువల్ల నందమూరి కుటుంబ సభ్యులు వీరి వివాహాన్ని అంగీకరించకపోగా.. కొంతకాలం తారకరత్నను దూరంగా ఉంచారు. ఇక నాలుగు సంవత్సరాల క్రితం తారకరత్న పుట్టినరోజు సందర్భంగా అందరూ కలిసిపోయారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…