Pooja Hedge: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన పూజా హెగ్డే ప్రస్తుతం నార్త్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల సౌత్ లో వరుసగా ప్లాప్ లు అందుకున్న పూజా ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తన వ్యక్తిగత విషయాలతో పాటు కుటుంబానికి సంబంధించిన విశేషాలను కూడా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకునేది.
తాజాగా పూజా హెగ్డే సోదరుడు వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను పూజ తన ఇంస్టాగ్రామ్ నోట్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలలో పూజా హెగ్డే చాలా అందంగా ఎప్పుడూ లేనంత ఆనందంగా కనిపిస్తూ పెళ్లిలో హైలైట్ గా నిలిచింది. పూజా హెగ్డే సోదరుడు రిషబ్ హెగ్డే వివాహ వేడుక ఇటీవల చాలా ఘనంగా జరిగింది. శివానీశెట్టి అనే అమ్మాయిని రిషబ్ ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.
ఈ పెళ్లికి సంబంధించి అన్నీ తానై చూసుకుంది పూజా. సోదరుడి వివాహ వేడుక సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. సోదరుడి వివాహ వేడుక సందర్భంగా పూజ ఎమోషనల్ అవుతూ..” నా సోదరుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి వేడుక మొదలైన సందర్భం నుంచి నేను ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నా. ఈ వేడుకలో నా ఆనందానికి ఆనందభాష్పాలు వచ్చాయి.
అన్నా మీరు మీ జీవితంలో తదుపరి దశలోకి అడుగుపెడుతున్నప్పుడు అ నియంత్రితంగా ప్రేమిస్తారని, నిండు హృదయాన్ని అందిస్తారని, శాంతి, అవగాహనతో ముందుకు సాగుతారని ఆశిస్తున్నా” అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో బంగారు వర్ణం పట్టు చీరలో పూజా హెగ్డే కుందనపు బొమ్మలా అందరిని ఆకట్టుకుంటుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…