Prudhvi Daughter: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్లుగా ఎంతోమంది గుర్తింపు పొందారు. ఇలా కమెడియన్ గా గుర్తింపు పొందిన వారిలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కూడా ఒకరు. ఎన్నో సినిమాలలో పృథ్వి కమెడియన్ గా మాత్రమే కాకుండా విలన్ గా కూడా నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అంటూ పృథ్వీ చెప్పే డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. ఎన్నో సినిమాలలో తన కామెడీ టైమ్ ఎంత ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన పృథ్వి కొంతకాలంగా విమర్శలో నిలుస్తున్నాడు.
వైసీపీ పార్టీకి మద్దతుగా ఉన్న పృథ్వీకి వైసిపి ప్రభుత్వం టిటిడి చైర్పర్సన్ గా బాధ్యతలు అప్పగించింది.అయితే అక్కడ ఉద్యోగస్తుల పట్ల తప్పుగా ప్రవర్తించడంతో పృద్విని ఆ పదవికి దూరం చేశారు. దీంతో తనపై తప్పుడు ప్రచారాలు చేసి పదవి నుండి తొలగించారని వైసీపీ ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యగా విమర్శలు చేస్తూ ఉంటాడు.
ఇదిలా ఉండగా ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తూ కమెడియన్ అనగానే గుర్తింపు పొందిన పృద్వి ప్రస్తుతం తన కూతురిని హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని సిద్ధమయ్యాడు. పృథ్వీ కూతురు పేరు శ్రీలు. పృధ్వి శ్రీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ద్వారా తన కూతుర్ని హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడు. ‘కొత్త రంగుల ప్రపంచం’అనే సినిమాకు పృద్వి తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాలో హీరోగా క్రాంతి కృష్ణ నటిస్తున్నాడు. శ్రీ పిఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. మొదటిసారిగా హీరోయిన్గా వెండితెరకు పరిచయం అవుతున్న పృథ్వీ రాజ్ కూతురు శ్రీలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూపుతిప్పుకోలేని అందంతో ఉన్న పృథ్వీ కూతురి ఫోటోలు చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…