Categories: FeaturedMovie News

Nani : చిరంజీవిగారు అలా అనడం వల్ల నాకేదో ఉందనుకున్నారు.. నేనొకటి మాట్లాడితే వాళ్లు ఒకటి అర్థం చేసుకున్నారు.. : హీరో నాని

Nani : నాచురల్ స్టార్ నాని కొత్త సినిమా అంటే.. సుందరానికి శుక్రవారం జూన్ 10న విడుదలయింది. మొదటి షో తరువాత పాజిటివ్ టాక్ తో ఉన్న ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అంటే.. సుందరానికి సినిమా ను వివేక్ అత్రేయ దర్శకత్వం వహించారు. ఇక వివేక్ సాగర్ సంగీతం అందించాడు. నాని కి జంటగా ఈ సినిమాలో నజ్రీయకి తొలిసారి స్ట్రైట్ తెలుగు సినిమా. ఇందులో ఒక ఇన్నోసెంట్ బ్రాహ్మణ యువకుడు సుందరం గా నాని కనిపిస్తాడు. ఇక ఇలాంటి వాడు అమెరికా వెళ్లడం క్రిస్టియన్ అమ్మాయి ఐన లీలా థామస్ ను ప్రేమించడం మతాంతర వివాహానికి సంబంధించిన కథను హాస్యభరితంగా రూపొందించాడు దర్శకుడు.

చిరంజీవి గారు అనుకున్నట్టు అలాంటిదేమి కాదు….

ఇక సినిమా ప్రచారాల్లో నాని పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు వాటిలో సినిమా టికెట్ రేట్స్ గురించి, ఇంకా ఇతర విషయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఈ సినిమాలో భలే భలే మగాడివోయి సినిమాలో మతిమరుపు లాగా ఏదైనా డిఫెక్ట్ ఉన్న పాత్ర చేస్తున్నారా అని ప్రశ్న ఎదురుకాగా చిరంజీవి గారు కూడా అలానే అనుకున్నారు కానీ అలాంటిదేమి లేదు. ఈసినిమాలో ఏ లోపం ఉండదు అంటూ చెబుతూనే చిరు కి ఖైదీ సినిమా ఎలానో అలా నాకు ఈ సినిమా అంటూ చెప్పారు. ఖైదీ సినిమా మొదట కృష్ణ గారు చేయాల్సి ఉన్నా ఆ సినిమా ఆయన వద్దన్నాక చిరు దగ్గరికి వచ్చింది. ఆ సినిమా తరువాత చిరంజీవి గారి కెరీర్ మలుపు తిరిగింది. ఆ కథ ఆయన కోసమే పుట్టిందా అనిపిస్తుంది. అలా ఈ సినిమా కథ కూడా నాకోసమే పుట్టిందా అని అనిపిస్తుంది.

ఇక టికెట్ రేట్ల విషయంలో నేను థియేటర్స్ ను కిరాణా కోట్లతో పోల్చానని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. కానీ అసలు జరిగింది వేరు. టికెట్ రేట్ల విషయంలో రెండు వైపులా సమస్య, న్యాయం జరిగేలా నిర్ణయాలు ఉండాలని అన్నాను కానీ నేను ఎవరిని కామెంట్స్ చేయలేదు. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియాలో వల్ల మనము ఒకటి మాట్లాడితే వాళ్లు ఒకటి రాసేసి పోస్ట్ చేస్తున్నారు. జనాలు అవే నిజం అనుకుంటున్నారు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago