Shyam Sigha Roy: శ్యామ్ సింగరాయ్ సినిమా రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిన నాని..ఎందుకో తెలుసా..?
Shyam Sigha Roy: నానికి చాలా రోజుల తర్వాత హిట్ పడింది. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ డిసెంబర్ 24న విడుదలైంది. హిట్ టాక్ తెచ్చుకుంది. న్యాచురల్ స్టార్ నాని రెండు క్యారెక్టర్లతో ఇరగదీశాడు.
దీనికి తోడు కృతి శెట్టి అందాలు, సాయిపల్లవి మెస్మరైజింగ్ ఫెర్ఫామెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మిక్కి జే మేయర్ మ్యూజిక్ చాలా బాగా కుదిరి సినిమా హిట్ కు కారణమయ్యాయి. వరసగా.. వీ, టక్ జగదీశ్ సినిమాలు ఘోరంగా నిరాశ పరచడంతో నాని కాస్త వెనకబడ్డాడు. అయితే వీటిని ఓటీటీల్లో రిలీజ్ చేశారు.
కాగా ఈసారి ఎలాగైనా శ్యాంసింగరాయ్ ను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనే గట్టి పట్టుదలతో నాని తో పాటు నిర్మాత వెంకట్ బోయినపల్లి ఉన్నారు. దీనికి అనుగుణంగానే సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు. నిర్మాత వెంకట్ బోయినపల్లి అయినా.. అన్ని నానినే ముందుండి నడిపించాడు. సినిమా ప్రమోషన్లతో బాగా కష్ట పడ్డాడు.
నైజాం ఏరియాలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. అయితే తెలంగాణలో కలెక్షన్లు బాగానే ఉన్నా… ఏపీలో ప్రభుత్వం థియేటర్ల టికెట్ రేట్లను తగ్గించడంతో అక్కడ కలెక్షన్లపై తీవ్రంగా ప్రభావం పడింది. తెలంగాణలో ఇప్పటి వరకు రూ. 8 కోట్ల వరకు సినిమా కలెక్ట్ చేసింది. కాగా ఇటీవల నాని ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు కూడా రచ్చకు దారి తీశాయి. అయితే లేటెస్ట్ గా ఓ విషయం ఫిలిం వర్గాల్లో చర్చనీయాంశం అయింది. నాని తన రెమ్యునరేషన్ లో 60 శాతం రిటన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. శ్యాం సింగరాయ్ సినిమాకు రూ. 8 కోట్లు పారితోషకం తీసుకోగా.. రూ. 5 కోట్లు ప్రొడ్యూసర్లకు తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం.అయితే నాని రెమ్యూనరేషన్ ఎందుకు తిరిగి ఇచ్చారు అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయంపై ఇటు నిర్మాతలు కానీ… అటు నాని కానీ స్పందించలేదు.
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…