ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఇంతవరకూ వెండితెరపై ఎంతోమంది ప్రేక్షకులను ఆలరించిన బాలకృష్ణ మొదటిసారిగా బుల్లితెరపై అన్ స్టాపబుల్ అనే షోకి హోస్ట్ వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు వెండితెరపై అలరించిన బాలకృష్ణ ఇప్పుడు బుల్లితెరపై కూడా తన హవా చూపిస్తున్నాడు.
ఈ షో తొలి ఎపిసోడ్ ను మంచు మోహన్ ఫ్యామిలీతో చిత్రీకరించారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రసారమైన ఈ షో భారీగా రెస్పాన్స్ ను అందుకుంది. మొదటి షో తోనే ఆన్లైన్ వేదికపై బాలయ్య మార్క్ ఏంటో కనిపించింది. అయితే తాజాగా అన్ స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నానితో కలసి చిందులు వేశారు బాలకృష్ణ.
ఇక ఈ ఎపిసోడ్లో బాలకృష్ణకు నాని ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సర్ప్రైస్ తో బాలయ్య పదేళ్లు వెనక్కి వెళ్లారు. అయితే నాని ఇచ్చిన ఆ సర్ప్రైజ్ ఏమిటంటే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో బాలకృష్ణ సహాయంతో ఆ అమ్మాయికి చికిత్స జరిగిందని నాని తెలిపాడు. అయితే కొన్నేళ్ల తర్వాత సహాయం పొందిన చిన్నారిని తెలుసుకున్నందుకు బాలకృష్ణ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ చిన్నారి ని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.
ఈ ఎపిసోడ్ ని చూసిన అభిమానులు ఎప్పుడో 2011 జరిగిన సంఘటన ఇవాళ నాని గుర్తు చేస్తే తప్పా బయటకు రాలేదు. బాలకృష్ణ చాలామందికి తెలియకుండా ఎన్నో ప్రాణాలను నిలబెట్టాడు. అతను చేసిన సహాయాన్ని ఎవరికీ తెలియనివ్వడు. అంతేకాకుండా తన సహాయం వల్ల ఒక జీవితం బాగుపడితే చాలు అని సంతోషిస్తాడనీ నెటిజన్స్ బాలయ్య ఫై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…