Movie News

Naresh : నాలుగేళ్ల క్రితమే పవిత్ర నాజీవితంలోకి వచ్చింది.. అప్పటినుంచి నా ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నింటిలో ఉంది… అప్పుడు నువ్వెక్కడకి పోయావ రమ్య : నరేశ్

Naresh : నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం పూటకో మలుపు తిరుగుతూ తెగ వైరల్ అవుతోంది. స్ట్రింగ్ ఆపరేషన్ లో పవిత్ర లోకేష్ నేను, నరేష్ సహజీవనం చేస్తున్నామని చెప్పడం తో వీళ్ళ వ్యవహారం రసవత్తరంగా మారింది. ఇక అటు పవిత్ర లోకేష్ మాజీ భర్త ఆమె పై ఘాటుగా కామెంట్స్ చేస్తుంటే మరో వైపు నరేష్ మూడో భార్య రమ్య మీడియాతో మాట్లాడి మరింత రచ్చ చేసింది. ఇక ఇన్నిరోజులూ చెప్పి చెప్పనట్టుగా విషయాన్ని చెప్పిన నరేష్ ఈరోజు భార్య రమ్య మీడియా లో విడాకులు తీసుకోలేదు నేనింకా భార్యనే అనడంతో చివరికి ఓపెన్ అయ్యారు.

ఎనిమిదేళ్లుగా నువ్వెక్కడ ఉన్నావు…

కన్నడ మీడియా పవిత్ర లోకేష్ పై స్ట్రింగ్ ఆపరేషన్ చేసి వాళ్ళు సహజీవనం చేస్తున్నారనే విషయాన్ని బయటపెట్టింది. ఇక వెంటనే నరేష్ మూడో భార్య మీడియా తో మాట్లాడి నరేష్ తో తాను ఇంకా విడాకులు తీసుకోలేదని చెప్పింది. ఇంకా నేను నరేష్ భార్యనే అంటూ మాట్లాడింది. దీంతో ఇక ఇపుడు సీనియర్ నటుడు నరేష్ కూడా స్పందించారు. నేను పురుషుడ్ని.. అంతేకాదు! మనిషిని కూడా.. నేను ఎన్నో వేల మందికి సహాయం చేశాను. కానీ, అదంతా చెప్పాలనుకోలేదు. నాకు ఓ ఎమోషనల్ గా తోడు అవసరం. ‘హ్యాపీ వెడ్డింగ్‌’ సమయంలో పవిత్రా లోకేష్‌ను కలిశాను. మేము ఫ్రెండ్స్‌ మాత్రమే. సమ్మోహనం సమయంలో బంధం బలపడింది.

నేను నా బాధలు షేర్ చేసుకున్నా, ఆమె తన బాధలు షేర్ చేసుకుంది అంటూ చెప్పారు. అలా తను బెస్ట్ ఫ్రెండ్ అయింది. తను నా ఫ్యామిలీ ఫ్రెండ్ అయింది. అందరూ అన్నట్లుగా నా ఫ్యామిలీ ఫ్రెండ్ అయింది. నన్ను తాను గైడ్ చేసింది, మంచి తోడుగా నిలిచింది. ఫ్యామిలీ లో ఫంక్షన్స్ అప్పుడు పవిత్ర ఉంది నువ్వెక్కడున్నావ్ రమ్య.. పవిత్ర నాకు నాలుగేళ్లుగా తెలుసు కానీ నువ్వు ఎనిమిదేళ్లుగా నాకు దూరంగా ఉన్నావు. బెంగళూరులో కూర్చొని నా మీద నిందలు వేస్తున్నావ్. నువ్వు ఎవరితో ఉన్నావ్, ఏం చేస్తున్నావో నాకు తెలుసు కానీ అవన్నీ ఇక్కడ చెప్పదలుచుకోలేదు. తనతో నా బంధాన్ని బద్నామ్ చేయడానికి ఇదంతా చేస్తున్నావు. ఫైవ్ బర్డ్స్ ఇన్ వన్ షాట్ అనేదే ఆమె ప్లాన్ అంటూ నరేష్ తన భార్య రమ్యపై కామెంట్స్ చేసాడు.

Bhargavi

Recent Posts

చిల్లర నాణాలతో చరిత్ర సృష్టించిన రైతు.. ద్వారకా తిరుమలకి కానుక!

తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ…

5 hours ago

నమస్కారం ఎందుకు చేస్తారు? ఎవరికి ఎలా చేయాలో తెలుసా? ఆశ్చర్యపోయే నిజాలు!

భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే…

5 hours ago

బట్టలు లేకుండా స్నానం… సంప్రదాయం ఏమంటోంది? నిజం ఏంటి?

ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…

6 hours ago

భర్త దీర్ఘాయుష్షు కోసం మహిళలు తప్పక చేయాల్సిన వ్రతం ఏది?

వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…

6 hours ago

ఖాళీ కడుపుతో నేరేడు తింటే ఏమవుతుందో తెలుసా?

వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…

6 hours ago

సతీదేవి శరీరాన్ని విష్ణువు ఎందుకు ఖండించాడు? ఆశ్చర్యకర గాథ!

హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…

8 hours ago