బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన 19 మంది కంటెస్టెంట్లలో నటరాజ్ మాస్టార్ ఉన్నన్ని రోజులు ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అతడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు జంతువుల పేర్లు పెట్టడం తీవ్ర ఇబ్బందులకు గురి చేసినా.. హౌస్ లో మాత్రం ఎంజాయ్ చేశారు.
బయట నెటిజన్లు మాత్రం అతడిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇదంతా ఇలా ఉండగా.. అతడు 4వ వారం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. 9 వ వారంలో విశ్వా ఎలిమినేట్ అయ్యారు. అయితే దీనిపై నటరాజ్ మాస్టార్ స్పందించారు. అతడి ఎలిమినేషన్ ఇటు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు, ఇటు అభిమానులకు షాక్ ను గురి చేసింది.
దీనిపై నటరాజ్ మాట్లాడుతూ.. అందరికీ ఎగ్జయిట్‌మెంట్ ఉన్న వార్త.. హౌస్‌లో నుంచి ఊసరవెల్లి బయటకు వచ్చేసింది.. ఎందుకంటే అది చేసిన పాపాలు పండాయి కాబట్టే ఇలా జరిగింది అంటూ అతడు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఓ వీడియోను చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు.
నీ ప్రవర్తనలో ఇంకా మార్పు రాలేదా.. ఇంకా జంతువుల పేర్లు పెట్టడంలోనే బిజీ గా ఉన్నావా.. అంటూ ఏకిపారేశారు. నువ్వెందుకు నాలుగోవారలంలోనే బయటకు వచ్చావు.. అప్పటికే నీ పాపాలు పండాయా అంటూ కౌంటర్లు ఇచ్చారు. విశ్వా ఆడిన ఆటనలో నువ్వు సగం కూడా ఆడలేదు అంటూ అతడిని విమర్శించారు నెటిజన్లు. నీ ఫోజులు, వేశాలు.. జంతువుల దగ్గర చూపించుకోపో.. జంతురాజా అంటూ ఆ వీడియో కింద కామెంట్లలో నెటిజన్లు రెచ్చిపోయారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…