Featured

Natti Kumar : అల్లు వారింట్లో విభేదాలు… అల్లు అర్జున్, శిరీష్ ల మధ్య పెరిగిన గ్యాప్..??

Natti Kumar : సినిమా నిర్మాత నట్టి కుమార్ సినిమాలకు సంబంధించిన విషయాల గురించి ఇండస్ట్రీలో జరుగుతున్న హాట్ టాపిక్స్ గురించి అయన స్పందన తెలియజేస్తూ ఉంటారు. ప్రస్తుతం కొన్ని రోజులుగా అల్లు అరవింద్ కుటుంబంలో విభేదాలు వస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో వాటి గురించి నట్టి కుమార్ స్పందించారు. అల్లు అర్జున్ మెగాస్టార్ కాంపౌండ్ నుండి హీరోగా ఎదిగినా ప్రస్తుతం తనకుంటూ సొంత ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు పుష్ప సినిమా వల్ల. అయితే ఇపుడు మెగా కుటుంబం అల్లు ఫ్యామిలీ మధ్య గ్యాప్ వచ్చింది అంటూ మొన్నా మధ్య వార్తలు వచ్చాయి, ఇపుడు అల్లు వాళ్లయింట్లోనే గ్యాప్ వచ్చింది అంటూ వార్తలు వస్తునాయి.

అల్లు అర్జున్, శిరీష్ మధ్య గ్యాప్…

అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్. పుష్ప సినిమాతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక తనకు ఇద్దరు సోదరులు ఉన్నారు. అందులో అల్లు బాబీ, శిరీష్ లు సినిమా ఇండస్ట్రీ లోనే ఉన్నా ఇంకా అంత సక్సెస్ అవ్వలేదు. అల్లు అరవింద్ సినిమా ఇండస్ట్రీ లో బిజినెస్ పరంగా ఒకప్పుడు నెంబర్ వన్ గా ఉన్నారు ప్రస్తుతం దిల్ రాజు ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. ఇక కొడుకుల్లో అల్లు అర్జున్ సక్సెస్ అయినట్లు మిగిలిన ఇద్దరూ అవ్వలేదు. ఇక శిరీష్ సినిమాల పరంగా అంత గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు. ఇక ఇపుడు బాలీవుడ్ వైపు చూస్తున్నాడని ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం శిరీష్ తన అన్న అల్లు అర్జున్ మీద అలిగి ముంబై వెళ్లిపోయాడంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వీటి పై నట్టి కుమార్ మాట్లాడుతూ ఈ విషయాల గురించి నాకు పెద్దగా తెలియదు అది వాళ్ళ కుటుంబ విషయం. ఇక నాకు అల్లు అరవింద్ కు పెద్దగా పడదు ఫిల్మ్ ఛాంబర్ రాజకీయాల్లో నాకు వ్యతిరేక వర్గానికి అయన చెందినవాడు, కానుక వాళ్ళ విషయాలు నాకు పెద్దగా తెలియవు. కానీ వారి కుటుంబంలో ఎలాంటి చీలిక అయితే లేదు ఇవన్నీ పుకార్లే అంతే అంటూ స్పందించారు. మెగాస్టార్ అనే మహా వృక్షం నుండి వీళ్లందరూ వచ్చారు, అది వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. ఇప్పటికీ బన్నీ, పవర్ స్టార్ అందరూ ఆ విషయం సందర్బం వచ్చినపుడు చెబుతారు. ఎవరికి వారు సొంత గుర్తింపుతో పైకి రావడం మంచివిషయమే అంటూ అభిప్రాయ పడ్డారు. ఇక అల్లు అర్జున్, శిరీష్ మధ్య విబేషాలు ఏమి లేవు వాళ్ళు కలిసే ఉన్నారు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago