Natti Kumar : సినిమా నిర్మాత నట్టి కుమార్ సినిమాలకు సంబంధించిన విషయాల గురించి ఇండస్ట్రీలో జరుగుతున్న హాట్ టాపిక్స్ గురించి అయన స్పందన తెలియజేస్తూ ఉంటారు. ప్రస్తుతం కొన్ని రోజులుగా అల్లు అరవింద్ కుటుంబంలో విభేదాలు వస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో వాటి గురించి నట్టి కుమార్ స్పందించారు. అల్లు అర్జున్ మెగాస్టార్ కాంపౌండ్ నుండి హీరోగా ఎదిగినా ప్రస్తుతం తనకుంటూ సొంత ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు పుష్ప సినిమా వల్ల. అయితే ఇపుడు మెగా కుటుంబం అల్లు ఫ్యామిలీ మధ్య గ్యాప్ వచ్చింది అంటూ మొన్నా మధ్య వార్తలు వచ్చాయి, ఇపుడు అల్లు వాళ్లయింట్లోనే గ్యాప్ వచ్చింది అంటూ వార్తలు వస్తునాయి.

అల్లు అర్జున్, శిరీష్ మధ్య గ్యాప్…
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్. పుష్ప సినిమాతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక తనకు ఇద్దరు సోదరులు ఉన్నారు. అందులో అల్లు బాబీ, శిరీష్ లు సినిమా ఇండస్ట్రీ లోనే ఉన్నా ఇంకా అంత సక్సెస్ అవ్వలేదు. అల్లు అరవింద్ సినిమా ఇండస్ట్రీ లో బిజినెస్ పరంగా ఒకప్పుడు నెంబర్ వన్ గా ఉన్నారు ప్రస్తుతం దిల్ రాజు ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. ఇక కొడుకుల్లో అల్లు అర్జున్ సక్సెస్ అయినట్లు మిగిలిన ఇద్దరూ అవ్వలేదు. ఇక శిరీష్ సినిమాల పరంగా అంత గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు. ఇక ఇపుడు బాలీవుడ్ వైపు చూస్తున్నాడని ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం శిరీష్ తన అన్న అల్లు అర్జున్ మీద అలిగి ముంబై వెళ్లిపోయాడంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వీటి పై నట్టి కుమార్ మాట్లాడుతూ ఈ విషయాల గురించి నాకు పెద్దగా తెలియదు అది వాళ్ళ కుటుంబ విషయం. ఇక నాకు అల్లు అరవింద్ కు పెద్దగా పడదు ఫిల్మ్ ఛాంబర్ రాజకీయాల్లో నాకు వ్యతిరేక వర్గానికి అయన చెందినవాడు, కానుక వాళ్ళ విషయాలు నాకు పెద్దగా తెలియవు. కానీ వారి కుటుంబంలో ఎలాంటి చీలిక అయితే లేదు ఇవన్నీ పుకార్లే అంతే అంటూ స్పందించారు. మెగాస్టార్ అనే మహా వృక్షం నుండి వీళ్లందరూ వచ్చారు, అది వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. ఇప్పటికీ బన్నీ, పవర్ స్టార్ అందరూ ఆ విషయం సందర్బం వచ్చినపుడు చెబుతారు. ఎవరికి వారు సొంత గుర్తింపుతో పైకి రావడం మంచివిషయమే అంటూ అభిప్రాయ పడ్డారు. ఇక అల్లు అర్జున్, శిరీష్ మధ్య విబేషాలు ఏమి లేవు వాళ్ళు కలిసే ఉన్నారు అంటూ చెప్పారు.

































