Categories: FeaturedMovie News

నయనతార సైలెంట్‌గా శ్రీమతి అయిపోయిందా..?!

సౌత్ ఇండియ‌న్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార పెళ్లి గురించి గత పదేళ్ల నుండి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఆమె శింబును పెళ్లి చేసుకుంటుంద‌ని ముందు రూమర్స్ వచ్చాయి. త‌ర్వాత శింబు నుంచి విడిపోయింది నయన్. ఆ తర్వాత ప్ర‌భుదేవాతో ప్రేమ‌లో ప‌డి అత‌డితో పెళ్లి వ‌ర‌కు వెళ్లింది. ఇందుకోసం సినిమాలు కూడా వ‌దిలేయ‌డానికి సిద్ధ‌మైంది. కారణాలు తెలియవు కానీ అత‌డితోనూ బంధం తెగింది. దాంతో కొన్నాళ్ళు సీరియ‌స్‌గా సినిమాల్లో బిజీ అయిపోయిన న‌య‌న్..

ఈమధ్యనే తాను హీరోయిన్‌గా న‌టించిన “నానుమ్ రౌడీదా” సినిమా ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో ప్రేమ‌లో ప‌డింది. వీళ్లిద్దరూ మంచి అండ‌ర్ స్టాండింగ్‌తో సాగుతున్నారు. నాలుగేళ్ల‌కు పైగా వీరి ప్రేమాయ‌ణం సాగుతోంది. ఇదిలా ఉంటే నయన్ ప్రస్తుతం మిస్ కాదు మిసెస్ అంటూ తాజాగా సోషల్ మీడియాలో మళ్ళీ నయన్ పై రూమర్స్ షికారు చేస్తున్నాయి. నయన తార తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్‌ను సైలెంట్‌గా పెళ్లి కూడా చేసుకుందని.. కానీ పైకి మాత్రం వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు చెప్తున్నారంటూ కోలీవుడ్ కోడై కూస్తుంది.

అయితే ఈ రూమర్స్ పై ఎప్పట్లాగే వీళ్లిద్దరూ స్పందించడం లేదు. అయితే ఇది పూర్తిగా అవాస్తవం అని తెలుస్తోంది. ఇప్పటికే నయనతారకు 3 విఫలమైన ప్రేమ కథల ఉన్న కారణంగానే.. గత ఐదేళ్లుగా విఘ్నేష్ శివన్ తో పెళ్లి అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అసలు నయనతార ఎప్పుడో పెళ్లి చేసుకుంటుందో అప్పుడే ఈ రూమర్స్ అగుతాయోమో.!

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago