సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి గురించి గత పదేళ్ల నుండి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఆమె శింబును పెళ్లి చేసుకుంటుందని ముందు రూమర్స్ వచ్చాయి. తర్వాత శింబు నుంచి విడిపోయింది నయన్. ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమలో పడి అతడితో పెళ్లి వరకు వెళ్లింది. ఇందుకోసం సినిమాలు కూడా వదిలేయడానికి సిద్ధమైంది. కారణాలు తెలియవు కానీ అతడితోనూ బంధం తెగింది. దాంతో కొన్నాళ్ళు సీరియస్‌గా సినిమాల్లో బిజీ అయిపోయిన నయన్..

ఈమధ్యనే తాను హీరోయిన్‌గా నటించిన “నానుమ్ రౌడీదా” సినిమా దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడింది. వీళ్లిద్దరూ మంచి అండర్ స్టాండింగ్‌తో సాగుతున్నారు. నాలుగేళ్లకు పైగా వీరి ప్రేమాయణం సాగుతోంది. ఇదిలా ఉంటే నయన్ ప్రస్తుతం మిస్ కాదు మిసెస్ అంటూ తాజాగా సోషల్ మీడియాలో మళ్ళీ నయన్ పై రూమర్స్ షికారు చేస్తున్నాయి. నయన తార తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్‌ను సైలెంట్‌గా పెళ్లి కూడా చేసుకుందని.. కానీ పైకి మాత్రం వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు చెప్తున్నారంటూ కోలీవుడ్ కోడై కూస్తుంది.

అయితే ఈ రూమర్స్ పై ఎప్పట్లాగే వీళ్లిద్దరూ స్పందించడం లేదు. అయితే ఇది పూర్తిగా అవాస్తవం అని తెలుస్తోంది. ఇప్పటికే నయనతారకు 3 విఫలమైన ప్రేమ కథల ఉన్న కారణంగానే.. గత ఐదేళ్లుగా విఘ్నేష్ శివన్ తో పెళ్లి అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అసలు నయనతార ఎప్పుడో పెళ్లి చేసుకుంటుందో అప్పుడే ఈ రూమర్స్ అగుతాయోమో.!






























