Nayanatara: చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా సక్సెస్ సాధించాలి అంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.సినీ బ్యాగ్రౌండ్ ఉన్న హీరోయిన్లు అయితే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి. అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చేవారు మాత్రం ఇండస్ట్రీలో కాస్టింగ్ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇప్పటికే ఎంతోమంది సినీ తారలు పేర్కొన్నారు.
ఇలా ఇండస్ట్రీలో సీనియర్ సెలబ్రిటీల నుంచి మొదలుకొని యంగ్ హీరోయిన్ల వరకు కూడా తాము క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నాము అంటూ ఇదివరకే చాలామంది కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే సీనియర్ నటిమని నయనతార సైతం మొదటిసారి క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పారు.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నయనతార క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది లేదు అనే విషయం గురించి తాను మాట్లాడనని అయితే ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుందని ఈమె తెలియజేశారు. అది మనం ప్రవర్తించే తీరును బట్టి మనకు ఎదురవుతుందని నయనతార తెలిపారు.
నేను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో నాకు ఈ కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురయ్యాయి. నన్ను కూడా చాలామంది కమిట్మెంట్ అడిగారు.అయితే అందుకు నేను నో అని సమాధానం చెప్పాను నేను నా టాలెంట్ ను నమ్ముకుని ఇక్కడికి వచ్చాను నా టాలెంట్ తోనే ఈ స్థాయికి ఎదిగాను అంటు నయనతార చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…