Rajinikanth: టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు రజినీకాంత్. అంతేకాకుండా ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు రజనీకాంత్. ఇక రజనీకాంత్ చివరగా జైలర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదే విషయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అదేమిటంటే..
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో లేడీ సూపర్‌స్టార్ నయనతార మరోసారి జత కట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆయన అతిథి పాత్ర పోషించిన లాల్ సలాం చిత్రం ఫిబ్రవరి 9వ తేదీన తెరపైకి రానుంది. ఆయన పెద్దకూతురు ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. కాగా ప్రస్తుతం జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ వేట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మలయాళం స్టార్ హీరోయిన్ మంజు వారియర్ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా రజనీకాంత్ తన 171వ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే.
రజనీకాంత్ సరసన లేడీ సూపర్ స్టార్..
ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. కాగా రజనీకాంత్ తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనే వార్త తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈయన ఇంతకుముందు నటించిన జైలర్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సీక్వెల్‌ను దర్శకుడు నెల్సన్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన సరసన నటి నయనతార నటించనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఈ జంట చంద్రముఖి, కథానాయకుడు, శివాజీ, దర్భార్, అన్నాత్తే మొదలగు ఐదు చిత్రాలలో కలిసి నటించింది. తాజాగా ఆరోసారి ఈ కాంబోలో చిత్రం రూపొందబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…