Nazriya Nazim – Fahad Fazil : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలు తొందరగా ప్రేమలో పడటం అంతే తొందరగా విడిపోవడం జరుగుతుంది. మరికొందరు ప్రేమలో పడి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోగా ఇంకొంత మంది సహజీవనం చేసే విడిపోయి ఎవరి దారి వారు చూసుకుంటారు.అయితే మరి కొంతమంది ఎలాంటి సహజీవనం లేకుండా ఒకరినొకరు ప్రేమించుకొని అర్థం చేసుకుని పెళ్లి చేసుకుని ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు. అలాంటి ఆదర్శ దంపతులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు మలయాల నటుడు ఫహద్ ఫాజిల్, నజ్రియా.
మలయాళ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన నటి నజ్రియా నజీమ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నజ్రియా తన మొదటి చిత్రం బెంగళూరు డేస్. ఈ సినిమాలో నటుడు ఫహద్ తో కలిసి నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఈ సినిమాలో నటించే సమయంలో ఆమె వయసు 18 సంవత్సరాలు మాత్రమే.ఇలా మొదటి సినిమాతోనే నటుడితో ప్రేమలో పడిన నజ్రియా 19 ఏళ్ల వయసుకే పెళ్లి చేసుకున్నారు.
ఇలా మొదటి సినిమాతోనే ప్రేమలో పడిన ఈ జంట మరి కాస్త ఆలస్యం చేస్తే వీరి వివాహానికి కుటుంబం ఎక్కడ నిరాకరిస్తుందోనని అలాగే తాను ప్రేమించిన వ్యక్తి ఎక్కడ మిస్ అవుతాడని భావించి ఈమె 19 సంవత్సరాలకే పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ఇదే విషయాన్ని నజ్రియా పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు.
ఇకపోతే ఈమె 19 సంవత్సరాల వయసుకే పెళ్లి చేసుకున్నప్పటికీ తనకన్నా ఏకంగా 12 సంవత్సరాలు వయసులో పెద్దవాడైన తనని పెళ్లి చేసుకున్నారు. ఇలా 19 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ఈమె తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతూ ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారు.పెళ్లి తర్వాత కూడా ఈమె పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇకపోతే తెలుగులో ఈమె రాజారాణి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే మెప్పించారు. తాజాగా నానితో కలిసి అంటే సుందరానికి సినిమాతో పూర్తిస్థాయి తెలుగు సినిమాలో సందడి చేశారు. పహద్ ఫాజల్ సైతం పుష్ప సినిమాలో బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో అద్భుతంగా నటించారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…