Movie News

రూ. 40 వేలు కోసం నెగటివ్ రివ్యూ.. పూలచొక్కా నవీన్ అరెస్ట్..

ప్రముఖ తెలుగు యూట్యూబర్, రివ్యూయర్ పూలచొక్కా నవీన్ ప్రస్తుతం పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ‘వర్జిన్ బాయ్స్’ సినిమా నిర్మాత రాజా దారపునేని చేసిన ఫిర్యాదు మేరకు ఫిల్మ్ నగర్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించారు. సినిమాల విజయాలు ఈ మధ్యకాలంలో మౌత్ టాక్‌ ఆధారంగానే నిర్ణయించబడుతున్న తరుణంలో యూట్యూబ్ రివ్యూల ప్రభావం పెరిగిపోయింది. ముఖ్యంగా మొదటి షో అయిపోయిన వెంటనే యూట్యూబ్‌ చానళ్లపై రివ్యూలు ప్రత్యక్షమవుతూ, ప్రేక్షకుల అభిప్రాయాలను మారుస్తున్నాయి.

Negative review for Rs. 40 thousand.. Flower shirt Naveen arrested..

ఈ క్రమంలో ‘పూలచొక్కా’ యూట్యూబ్ ఛానెల్ నడిపిస్తున్న నవీన్‌ ఇటీవల విడుదలైన చిన్న చిత్రం ‘వర్జిన్ బాయ్స్’ పై తీవ్ర నెగటివ్‌ రివ్యూ ఇచ్చారు. “ఇది కథ లేకుండా తీసిన సినిమా… చూస్తే రిలాక్స్ కాదు, ఫుల్ బోర్” అంటూ సెటైర్లు వేసిన ఆయన, టమోటా రేటింగ్‌లో సినిమాకు “సగం టమోటా” ఇచ్చారు. ఈ రివ్యూ వల్ల సినిమా పట్ల ప్రజల్లో తక్కువ అభిరుచి కలగడంతో, థియేటర్లకు రావడం తగ్గిపోయిందని నిర్మాత రాజా దారపునేని అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలోని అసలు సమస్య ఏమిటంటే.. నవీన్ తమ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇవ్వడానికి రూ. 40 వేలు డిమాండ్ చేశాడని, తిరస్కరించగానే నెగటివ్ రివ్యూ ఇచ్చాడని నిర్మాత ఆరోపించారు. దీన్ని తీవ్రంగా తీసుకున్న రాజా దారపునేని, ఈ విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, నవీన్‌ను విచారణకు పిలిపించి కొన్ని గంటల పాటు ప్రశ్నించిన తర్వాత వదిలినట్టు సమాచారం.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. యూట్యూబ్‌ రివ్యూయర్ల బాధ్యత ఎంతవరకు ఉండాలి? విమర్శలు నిజంగా సినిమా చూసి వస్తున్నాయా లేక వెనుక ఉన్న లాభనష్టాల పర్యవసానమా? అన్న ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా చిన్న సినిమాల విజయంలో ఈ రకమైన ప్రభావాలు ఎంతవరకు న్యాయమైనవి అన్నది పరిశ్రమలో పెద్ద చర్చగా మారింది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

1 month ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

1 month ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago