మన దేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ విక్రయాలు క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్యాకేజింగ్ చేసి విక్రయించే డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ లో కాల్షియం, మెగ్నీషియం తప్పనిసరి అని కేంద్రం వెల్లడించింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
ప్రముఖ కంపెనీలు మంచినీటిని శుద్ధి చేసే ప్రక్రియలో భాగంగా శరీరానికి అవసరమైన ఖనిజాలను మంచినీటి నుంచి తొలగిస్తున్నాయి. ఈ విషయం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి వచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నీటిలో అవసరమైన ఖనిజాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ను కోరగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ కేంద్రం అనుమతితో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ ప్రముఖ కంపెనీలకు ఈ నెల 31వ తేదీలోగా కాల్షియం, మెగ్నీషియం ఇతర ముఖ్యమైన ఖనిజ లవణాలు మంచినీటిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని గడువును ఇచ్చింది. లీటర్ మంచినీటిలో 20 మిల్లీగ్రాముల కాల్షియం, 10 మిల్లీగ్రాముల మెగ్నీషియం తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటికే పలు ప్రముఖ బ్రాండ్లు నూతన నిబంధనలను అనుగుణంగా డ్రింకింగ్ వాటర్ ను మార్కెట్ లో విడుదల చేస్తామని వెల్లడించాయి.
కిన్లే సంస్థ ఇప్పటికే క్యాల్షియం, మెగ్నీషియంలతో కూడిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ కొత్త నిబంధనల వల్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తాగే వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…