గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా.. అయితే ఆల్కహాల్ సేవించండి..?

మనం ఎక్కువగా సినిమాల్లోనూ, బయట హోర్డింగుల్లోనూ వినిపించే, కనిపించే పదం మద్యపానం ఆరోగ్యానికి హానికంరం. అయితే మద్యపానం సేవించడం వల్ల ఆరోగ్యానికి మంచిదే అని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. అదేంటి అనుకుంటున్నారా.. అయితే దీనిని పూర్తిగా చదవండి. గుండె జబ్బుతో బాధపడేవారు తక్కువ మోతాదులో లేదా మితంగా ఆల్కహాల్ సేవించడం వల్ల.. గుండెపోటు, స్ట్రోక్, మరణం సంభవించే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందట.

లండన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనాన్ని బీఎమ్‌సీ మెడిసిన్ జర్నల్‌లోప్రచురించారు. మద్యం తీసుకోకుండా ఉండే వారిలో కంటే మితంగా మద్యం తీసకునే వారిలో 50% ప్రమాదం తగ్గుతుందని ఈ అధ్యయనం ద్వారా వెల్లడించారు. సగటున 6 గ్రాముల మద్యం తీసుకుంటే గుండే వ్యాధులతో బాధ పడేవారు మరణించే ప్రమాదం తగ్గుతుందని వెల్లడైంది.

అదే రోజుకు 8 గ్రాముల మద్యం సేవించడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ కారణంగా చనిపోయే ప్రమాదం 27% తగ్గుతుందని అధ్యయనం వెల్లడించింది. అదే మరణించే శాతంలో దాదాపు 21 శాతం రోజుకు 7 గ్రాముల మద్యం తీసుకునే వారిలో తగ్గుతుందని అధ్యయనం ద్వారా వెల్లడించారు. ఇలా చేయడం ద్వారా మరణించే శాతాన్ని తగ్గించవచ్చు కానీ కొత్తగా మద్యాన్ని అలవాటు చేసుకునే వారు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదని అధ్యయన బృందంలో ఒక సభ్యురాలైన చెంగి డింగ్ చెప్పుకొచ్చారు.

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. ఏది ఏమైనా, చాలా తక్కువగా ఆల్కహాల్ తాగడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని ప్రస్తుత అధ్యయనం చెబుతోంది.