బిహార్ రాష్ట్రంలోని భోజ్ పూర్ జిల్లాలో ఓ యువతికి మూడు నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. ఆ దంపతులు మూడు నెలలు అన్యోన్యంగా ఉన్నారు. కొత్త పెళ్లికూతురు కూడా వాళ్ల ఇంట్లో వారితో బాగానే కలివిడిగా ఉంది. తన అత్త ఇంటి నుంచి ఆమె రక్షాబంధన్ రోజున బంధువుల ఇంటికి వెళ్లింది.
అక్కడ నుంచి పాట్నాలోని షాపింగ్ కు ఆమె తల్లితో వెళ్లిన ఆ యువతి కనిపించకుండా పోయింది. ఆ షాపింగ్ కాంప్లెక్స్ లో ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో కంగారు పడిన ఆమె ఇంట్లో బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె ఓ వ్యక్తితో పారిపోయినట్లుగా తెలిసింది.
భోజ్‌పూర్‌లోని కిషున్‌పూర్ గ్రామానికి చెందిన సింటు కుమార్‌తో ఆమె పారిపోయినట్లుగా తాము అనుమానిస్తున్నట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెకు పెళ్లి కాకముందు అతడితో మాట్లాడేదని.. అతడే ఈ పని చేసి ఉంటాడని పేర్కొన్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా.. రక్షాబంధన్ అయిపోయి రెండు రోజులు అయినా.. కోడలు ఇంటికి రాలేదని.. ఇంటికి పంపించాలని తన అత్త వాళ్ల ఇంటికి ఫోన్ చేసి అడగడంతో వాళ్లు కంగారు పడ్డారు. విషయం ఎలా చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతీ రోజు ఏదో ఒక ప్రదేశంలో జరుగుతూనే ఉన్నాయి.. వారిని కన్న తల్లిదండ్రులను కన్నీటిని మిగుల్చుతూనే ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…