Categories: FeaturedGeneral News

వివాహం జరిగి మూడు రోజులు.. అప్పడే గొడవలు.. కోపంతో భర్త ఏం చేశాడంటే..?

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం అనేది సాధారణం. అయితే అవి ఎంతో కాలంగా ఉండవు. ఈ రోజు గొడవపడితే మరుసటి రోజు సర్దుకుపోతారు. కానీ పెళ్లి జరిగి మూడు రోజులు కూడా కాలేదు… అప్పుడే వారి మధ్య గొడవలు వచ్చాయి. దీంతో ఆ నవవరుడు కత్తితో చెయ్యిని కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిగిత్యాల జిల్లా కేంద్రంలోని మార్కండేయనగర్ కు చెందిన బాబాకు ఓ యువతితో మూడు రోజుల క్రితం పెళ్లి జరిగింది. అప్పటి వరకు ఇరువురి కుటుంబ సభ్యులు కూడా సంతోషంగానే ఉన్నారు. పెళ్లి సమయంలో కూడా ఎలాంటి గొడవలు కాలేదు. తర్వాత పెళ్లి అనంతరం జరగాల్సిన కార్యక్రమాలకు సంబంధించి పనులు కూడా జరుగుతున్నాయి. అయితే బాబాకు అతడి భార్యకు రెండో రోజు నుంచే మనస్పర్థలు వచ్చాయి.

ఒకరంటే ఒకరికి పడనంతగా తయారయ్యాయి ఆ గొడవలు. దీంతో యువకుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పెళ్లి జరిగి కనీసం మూడు రోజులు కూడా కాలేదు.. అప్పుడే గొడవలు ఏంటని.. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని.. వారిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు పోలీసులు. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత కూడా వాళ్లల్లో మార్పు రాలేదు. దీంతో బాబా తట్టుకోలేక పదునైన కత్తి తీసుకొని చెయ్యి, వీపు భాగాన కోసుకున్నాడు.

దీంతో రక్తస్రావం కాగా అతడిని కుటుంసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లైన మూడు రోజులకే ఇలా అవ్వడానికి గల కారణాలు ఏంటి..? వాళ్లిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago