Niharika -Akhil: మెగా డాటర్ నిహారిక అక్కినేని వారసుడు అఖిల్ గురించి అందరికీ సుపరిచితమే ఇద్దరు కూడా భారీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి సెలబ్రిటీలే. అయితే అఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నిహారిక సైతం పలు సినిమాలలో నటించిన హీరోయిన్ గా గుర్తింపు రాకపోవడంతో ఈమె వెబ్ సిరీస్ లలో నటిస్తూ వాటిని నిర్మిస్తూ నిర్మాతగా స్థిరపడ్డారు.
ఇక అఖిల్ ఇండస్ట్రీకి అఖిల్ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. అయితే ఈయన ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం అఖిల్ అనిల్ సుంకర నిర్మాణంలో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుందని చెప్పినప్పటికీ సంక్రాంతి బరి నుంచి తప్పుకుందని తెలుస్తుంది.
ఇకపోతే నిహారిక అఖిల్ విషయానికి వస్తే వీరిద్దరూ కలిసి ఒక షార్ట్ ఫిలిం లో నటించారని విషయం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అఖిల్ తన మొదటి సినిమా అఖిల్ సినిమాలో నటించక ముందే నిహారికతో కలిసి ఒక షార్ట్ ఫిలింలో నటించారని సమాచారం ఇక ఈ విషయం ఇండస్ట్రీలో ఉన్న వారికి తప్ప ఎవరికీ తెలియదు.తాజాగా ఒక కుకింగ్ షోలో పాల్గొన్నటువంటి నిహారిక ఈ విషయాన్ని తెలియజేయడంతో ఈ విషయం వైరల్ గా మారింది.
ఇకపోతే ఈ షార్ట్ ఫిలిం విడుదలకు నోచుకోలేదంటూ నిహారిక షాక్ ఇచ్చారు. తమకు డబ్బు కన్నా పరువే ముఖ్యమని అందుకే ఈ షార్ట్ ఫిలిం విడుదల చేయలేదంటూ నిహారిక తెలియజేశారు.అయితే నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ ఎంతో బిజీగా మారారు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ షార్ట్ ఫిలిం విడుదల చేస్తే తప్పకుండా మంచి వ్యూస్ రాబడుతుందని అభిమానులు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…