Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు గత కొంతకాలంగా ఈమె పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.ఈమె 2020 సంవత్సరంలో జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకొని ప్రస్తుతం తనకు దూరంగా ఉండటంతో ఈ వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటి అనే విషయం గురించి కూడా అందరూ ఆలోచిస్తున్నారు. అయితే నిహారికకు సినిమాలపై ఉన్న పిచ్చి కారణంగానే ఇండస్ట్రీలోకొనసాగడం తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతోనే ఈ విషయం గురించి మనస్పర్ధలు తలెత్తినట్లు తెలుస్తోంది. పెళ్లి కాకముందు నిహారిక పలు సినిమాలలో హీరోయిన్గా నటించారు.
పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి నిహారిక నిర్మాతగా మారారు. తాజాగా ఈమె మరొక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.నిర్మాతగా కొనసాగుతూనే మరోవైపు హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది.ఇలా హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలోనే తన భర్తకు తనకు మధ్య మనస్పర్ధలు తలెత్తి విడాకుల వరకు వచ్చారని వాదనలు కూడా వినపడుతున్నాయి.
ఇలా విడాకుల వార్తలు వస్తున్న తరుణంలో నిహారిక కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ ఫోటోషూట్లు చేయించుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలను కనుక చూస్తే నిహారిక తప్పకుండా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని స్పష్టమవుతుంది.ఇప్పటికైనా నిహారిక తన విడాకుల గురించి స్పందిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…