Movie News

Raj Kumar: చిరంజీవిలా ఉండడమే నాకు శాపమైంది… నటుడు రాజ్ కుమార్ కామెంట్స్ వైరల్!

Raj Kumar: సినిమా ఇండస్ట్రీలో గత 30 సంవత్సరాలుగా కొనసాగుతూ జూనియర్ చిరంజీవిగా గుర్తు పొందిన సీనియర్ నటుడు రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో సీరియల్స్ లో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజ్ కుమార్ అచ్చం చిరంజీవి పోలికలతో ఉండటం వల్ల జూనియర్ చిరంజీవిగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రాజకుమార్ సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజ్ కుమార్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
ఈ ఇంటర్వ్యూలో రాజ్ కుమార్ మాట్లాడుతూ “చిరంజీవి లాగా పోలికలు ఉండటం నా అదృష్టం. కానీ అలా ఉండటం వల్లే నేను హీరోగా సక్సెస్ కాలేక ఇక్కడే మిగిలిపోయాను అంటూ చెప్పుకొచ్చాడు. నేను చిరంజీవి పోలికలతో ఉండటం చూసేవారికి గొప్పగా ఉంటుంది.

ఇండస్ట్రీలో మాత్రం అది నాకు మైనస్ పాయింట్. ఆయన పోలికలతో ఉన్నందుకు మర్రి చెట్టు కింద కలుపు మొక్కల తయారైంది నా పరిస్థితి అంటూ ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి ఇండస్ట్రీలో నన్ను తొక్కేసారని కొందరు అన్నారు. కానీ అలా జరిగి ఉంటే ఈ రోజు సీరియల్స్ లో కూడా కనిపించేవాడిని కాదు అంటూ తెలిపాడు. జూనియర్ చిరంజీవి అని గుర్తింపు రావటం వల్ల తెలుగు ఇండస్ట్రీ వదిలి కన్నడ పరిశ్రమకు వెళ్ళిపోయాను.

Raj Kumar: అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది..

ఇక ప్రస్తుతం ఇక్కడ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నాను అంటూ రాజ్ కుమార్ వెల్లడించాడు. ఈ క్రమంలో చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ.. చిరంజీవి గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవటం సంతోషంగా అనిపించింది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం జనని, కేరాఫ్ అనసూయ వంటి సీరియల్స్ లో నటిస్తూ రాజ్ కుమార్ బిజీగా ఉన్నాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago