Featured

అతడిని ఆసుపత్రిలో చూపించండి.. లేదంటే సమాజానికి ప్రమాదం: నిహారిక

సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై సినీ వర్గాలతో పాటు ఏపీ మంత్రులు తీవ్రంగా స్పందించారు. సినీ పరిశ్రమలో అయితే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. రెండు రోజుల పాటు విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి మరీ వ్యక్తిగంతగా కూడా దూషించాడు.

దీనికి పవన్ అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. దారుణమైన బూతులతో పవన్ ని కించపరిచిన పోసానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జనసేన నాయకురాలు నిహారిక కూడా మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోసాని కృష్ణమురళి మానసిక రోగిగా మారాడని.. అతడిన వెంటనే ఆసుపత్రిలో చూపించండి.. లేదంటే సమాజానికి ప్రమాదం అంటూ అతని పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతడికి తగినట్లుగా మెంటల్ కృష్ణ సినిమా తీశాడని.. ప్రస్తుతం అతడికి ఆ టైటిల్ సరిగ్గా సరిపోతుందంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ ఆడవాళ్లపై ఎలాంటి బ్యాడ్ కామెంట్లు చేయలేదని.. అయితే జగన్ పై వ్యాఖ్యలు చేశారనే పోసాని రియాక్ట్ అవుతున్నారని పవన్ పై అనవసరమైన ఆరోపణలు చెయ్యవద్దని హెచ్చరించింది. పోసానిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. ఈ సందర్భంగా జనసేన నాయకులు నిహారిక డిమాండ్ చేసింది. అతడిని వెంటనే అరెస్టు చేయాలని ఈ సందర్భంగా నిహారిక కోరింది. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago