బిగ్ బాస్ 5 రియల్టీ హౌస్ లో కంటెస్టెంట్స్ తగ్గుతున్నా కొద్ది.. టాస్క్ తీవ్రత కూడా పెంచుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. తాజాగా టీవీలో టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ లో ఉన్న 16 మందిని జంటలుగా విడిపొమ్మని చెప్పాడు. దీని కంటే ముందు వాళ్లు వెయిట్ ను చెక్ చేసి.. ఓ బోర్డు మీద రాశారు. అందులో ప్రతీ ఒక్కరి వెయిట్ కనిపిస్తుందట.
అలా జరగుతున్న క్రమంలోనే ఇంట్లో ఉన్న తిను బండారాలు మొత్తం రేషన్ రూంలో పెట్టి తాళం వేసేశారు. దీంతో వాళ్ల వెయిట్ ను అంతక ముందు ఉన్న దాని కంటే తగ్గాలని.. అలా అయితేనే కెప్టెన్సీ టాస్క్ లో ఫర్ ఫామ్ చేసేందుకు చాన్స్ ఉంటుందని తెలిపారు. దీంతో వాళ్లు ఎనిమిది జంటలుగా విడిపోయారు. ఎవరికీ వారు కసరత్తు మొదలు పెట్టారు.
ఇలా చేస్తున్న దానిలో లోబో కాసేపు నవ్వులు పూయించాడు. నటరాజ్ తో లోబో జంటగా ఏర్పడ్డాడు. ఇక నటరాజ్ చెప్పిన మాట వింటూ.. లోబో అతడి ముందు బయపడినట్లుగా చేశారు. గెలవాలంటే తగ్గాల్సిందేలో ఎవరికి వారు తగ్గడానికి ప్రయత్నించారు. ఈ క్రమలోనే మధ్యలో టాస్క్ లు ఇస్తున్నాడు. అందులో మొదటిది.. ‘పట్టుకోండి చూద్దాం’. దీనిని ఒక జంట పవర్ రూంకి వెళ్లి.. ఆ జంటకు ఎవరు ప్రతి జంటగా రావాలని కోరుకుంటున్నారో చెప్పాలి.
ఇలా మొదట నటరాజ్ ఆ పవర్ రూం యక్సెస్ పొంది.. శ్రీరామ్, హమిదాను సెలెక్ట్ ఈ టాస్క్ కు ఎంపిక చేసుకున్నారు. కానీ చివరకు ఆ టాస్క్ లో నటరాజ్, లోబో ఓడిపోయి.. వాళ్లకు ఉన్న వెయిట్ కంటే.. మరి కొంత బరువును పెంచుకున్నారు. శ్రీరామ్, హమిదా వెయిట్ ను తగ్గించుకున్నారు. దీంతో నటరాజ్ కాస్త అసహనానికి గురయ్యి.. లోబోతో విచిత్రంగా మాట్లాడుతుండగ.. లోబో ముఖ కవలికలు నవ్వు తెప్పించాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…