సమంత, నాగచైతన్య మధ్య గత కొన్ని రోజుల నుంచి విడాకుల వ్యవహారం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. రోజుకో వార్తతో హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై నాగచైతన్య లేదా సమంత కూడా ఇంత వరకు ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు. దీంతో ఇంకా ఆ వార్తలకు బలం చేకూరేలా చేస్తున్నాయి.
కొందరైతే సమంత పెళ్లి రోజున భరణం కింద భారీగా తీసుకుంటుందనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కోర్టును ఆశ్రయించారని.. దానికి నాగార్జున కూడా అన్ని సిద్ధం చేశారని కొంతకాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ. అంతే కాదు సమంత ముంబాయ్ కి వెళ్లి అక్కడే బాలీవుడ్ సినిమాలు తీస్తూ అక్కడే కొంత కాలం వరకు ఉండబోతోందని కూడా పుకార్లు వచ్చాయి.
అయితే దీనిపై సమంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సమంతకు సంబంధించి దుస్తుల బ్రాండ్ ‘సాకి’ ఏర్పాటుచేసి నిన్నటితో ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆమె ఓ వేడుకను నిర్వహించింది. అలాగే ఆమె సోషల్ మీడియాలోని అభిమానులతో ముచ్చటించారు. ఇలా చేస్తానని ముందుగానే చెప్పిన సామ్.. చెప్పినట్లుగానే అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ముంబైకి మకాం మారుస్తున్నారట కదా, అని ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు అది రూమర్ మాత్రమే, నాకు లైఫ్ ఇచ్చిన హైదరాబాద్ ని వదిలి ఎక్కడికీ వెళ్ళను అన్నారు. హైదరాబాద్ నా హోమ్ టౌన్ అంటూ చెప్పుకొచ్చారు. ఇటువంటివి అన్నీ రూమర్స్ అని కొట్టిపడేశారు. దీంతో ఇలా వస్తున్న వార్తలు అన్నీ రూమర్సే అని.. ఆమె చెప్పకనే చెప్పారు. ఈ పుకార్లు ఇలా ఉంటే.. ఆమె తన సాకీ ఫ్యాషన్ గార్మెంట్స్ బ్రాండ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సాకీ బ్రాండ్ ని ప్రేమించినందుకు.. ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…