Featured

ఉచితంగానే చెవి, ముక్కు, గొంతు సర్జరీలు.. చారిటీని ప్రారంభించిన బాలీవుడ్ నటుడు..

కరోనా మొదటి వేవ్ నుంచి సెకండ్ వేవ్ వరకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ చేస్తోన్న సహాయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో విల‌న్‌గా క‌నిపించే సోనూ.. రియ‌ల్ లైఫ్లో మాత్రం అంద‌రిచేత హీరో అనిపించుకున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు బాలీవుడ్ హీరో సోనూసూద్ చేసిన సాయం వెలకట్టలేనిది.

రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి సొంత ఖర్చులతో బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి ఎందరో వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చారు. అలాగే ఎవ‌రు స‌హాయం అడిగినా లేద‌నుకుండా అర్హులైన ప్ర‌తీ ఒక్క‌రికీ సాయం చేస్తూ మాన‌వ‌త్వాన్ని చాటుకున్నాడు. ప్రాంతం, కులం, భాషతో సంబంధం లేకుండా ఆప‌ద‌లో ఉన్న‌వారిని అండ‌గా నిలుస్తున్నాడు.

ఇక ఆంధ్ర ప్ర‌దేశ్‌లో కూడా ఆర్థిక క‌ష్టాలు ఎదుర్కొంటున్న ఒక రైతుకు ట్రాక్ట‌ర్ పంపించి.. ఎంతో మంది ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ఇదిలా ఉండగా మరోసారి అతడు దాన గుణాన్ని చాటుకున్నాడు. ఈఎన్టీ(చెవి, ముక్కు, గొంతు) సర్జరీలను ఉచితంగా అందించేందుకు అతడు ‘సోనూ చారిటీ ఫౌండేషన్ ’ ను ప్రారంభించినట్లు అతడు తన ఇన్ స్టాగ్రామ్ లో తెలియజేశాడు.

ఇలా మొదలు పెట్టడం సంతోషంగా ఉందని.. ఇక మనం అన్నీ వినగలం, వాసన చూడగలం, రుచిన ఆస్వాదించగలం అంటూ పేర్కొన్నాడు. వీటిని పొందాలంటే.. తొలుత soodcharityfoundation.orgలోకి లాగిన్ అవ్వాలి. అందులో పేర్కొన్న వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి మీకున్న మెడికల్‌ ప్రాబ్లమ్‌ని కూడా క్లుప్తంగా వివరించాల్సి ఉంటుంది. వెంటనే అక్కడి వైద్య సిబ్బంది వివరాలను నమోదు చేసుకున్న వ్యక్తిని కాంటాక్ట్ అయి ఆసుపత్రికి సంబంధించి పూర్తి వివరలను తెలియజేస్తారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago