కరోనా మొదటి వేవ్ నుంచి సెకండ్ వేవ్ వరకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ చేస్తోన్న సహాయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో విలన్‌గా కనిపించే సోనూ.. రియల్ లైఫ్లో మాత్రం అందరిచేత హీరో అనిపించుకున్నాడు. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులకు బాలీవుడ్ హీరో సోనూసూద్ చేసిన సాయం వెలకట్టలేనిది.

రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి సొంత ఖర్చులతో బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి ఎందరో వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చారు. అలాగే ఎవరు సహాయం అడిగినా లేదనుకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకున్నాడు. ప్రాంతం, కులం, భాషతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్నవారిని అండగా నిలుస్తున్నాడు.
ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న ఒక రైతుకు ట్రాక్టర్ పంపించి.. ఎంతో మంది ప్రశంసలు అందుకున్నాడు. ఇదిలా ఉండగా మరోసారి అతడు దాన గుణాన్ని చాటుకున్నాడు. ఈఎన్టీ(చెవి, ముక్కు, గొంతు) సర్జరీలను ఉచితంగా అందించేందుకు అతడు ‘సోనూ చారిటీ ఫౌండేషన్ ’ ను ప్రారంభించినట్లు అతడు తన ఇన్ స్టాగ్రామ్ లో తెలియజేశాడు.
ఇలా మొదలు పెట్టడం సంతోషంగా ఉందని.. ఇక మనం అన్నీ వినగలం, వాసన చూడగలం, రుచిన ఆస్వాదించగలం అంటూ పేర్కొన్నాడు. వీటిని పొందాలంటే.. తొలుత soodcharityfoundation.orgలోకి లాగిన్ అవ్వాలి. అందులో పేర్కొన్న వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి మీకున్న మెడికల్ ప్రాబ్లమ్‌ని కూడా క్లుప్తంగా వివరించాల్సి ఉంటుంది. వెంటనే అక్కడి వైద్య సిబ్బంది వివరాలను నమోదు చేసుకున్న వ్యక్తిని కాంటాక్ట్ అయి ఆసుపత్రికి సంబంధించి పూర్తి వివరలను తెలియజేస్తారు.































