Nirupam Paritala: బుల్లితెర శోభన్ బాబుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న పరిటాల నిరుపమ్ అందరికీ సుపరిచితమే.ఈయన ఈ పేరు కన్నా డాక్టర్ బాబుగా ఎంతో గుర్తింపు పొందారు.స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన డాక్టర్ బాబు ప్రస్తుతం ఈ సీరియల్ కు దూరమయ్యారు.
ఇలా కార్తీకదీపం సీరియల్ నుంచే కాకుండా ఈయన బుల్లితెరపై ఎలాంటి సీరియల్స్ లోను సందడి చేయలేదు. అయితే పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారని అలాగే సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తానని గత వీడియోలలో తెలిపారు. ఇకపోతే తన భార్య మంజులతో కలిసి డాక్టర్ బాబు ఏదో ఒక వీడియో ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు.
మంజుల నిరుపమ్ అనే పేరుతో వీరిద్దరూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే అయితే నిత్యం ఏదో ఒక వీడియో ద్వారా మంజుల అభిమానులను సందడి చేస్తుంటారు. ఇక ఈ వీడియోలో డాక్టర్ బాబు సైతం తన పంచ్ డైలాగులతో అందరిని నవ్విస్తుంటారు.ఈ క్రమంలోనే తాజాగా వరలక్ష్మీ వ్రతం అంటూ నగల షాపింగ్ కి వెళ్ళిన వీడియోని మంజుల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు.
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇలా డాక్టర్ బాబు మంజుల వీడియోలు చూసినా అభిమానులు ఇకపై డాక్టర్ బాబు బుల్లితెర సీరియల్స్ లో నటించరా? ఇలా కేవలం యూట్యూబ్ వీడియోలకు మాత్రమే పరిమితం అవుతారా? అంటూ పెద్ద యెత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ విధంగా అభిమానులలో తలెత్తుతున్న ఈ ప్రశ్నలకు డాక్టర్ బాబు ఏ విధమైనటువంటి సమాధానం చెబుతారు తెలియాల్సి ఉంది.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…