Categories: FeaturedMovie News

బాలకృష్ణ శ్రీదేవి కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాకపోవడానికి కారణం ఏంటో మీకు తెలుసా.?!

ఈ ఇద్దరు బాల నటీనటులుగానే తమ సినీకెరీర్ ను ప్రారంభించడం జరిగింది.1970 లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన మా నాన్న నిర్దోషి అనే తెలుగు సినిమా లో బాలనటిగా శ్రీదేవి నటించింది. ఆ తర్వాత నేను మనిషినే,విధి విలాపము,బడిపంతులు లాంటి సినిమాల్లో బాలనటిగా చేసి తర్వాత 1978 సంవత్సరంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పదహారేళ్ళ వయసు సినిమా లో హీరోయిన్ గా నటించింది.

ఆ తర్వాత వేటగాడు, మోసగాడు, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, బెబ్బులిపులి, ప్రేమాభిషేకం, కిరాయి కోటిగాడు, దేవత లాంటి సినిమాల్లో నటిస్తూ సడెన్ గా ఉత్తరాది సినిమాల్లోకి వెళ్ళిపోయింది. 1974లో వచ్చిన తాతమ్మకల సినిమాతో బాలకృష్ణ బాలనటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత రామ్ రహీం, అన్నదమ్ముల అనుబంధం, మంగమ్మగారి మనవడు, భలే దొంగ, ముద్దుల కృష్ణుడు, ముద్దుల మావయ్య లాంటి సినిమాల్లో నటించారు.

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో నటించి ఒక బాలకృష్ణతో మాత్రం శ్రీదేవి జోడీగా నటించలేదు. కారణం ఏమిటి అనే విషయంలో రకరకాల రూమర్స్ చెక్కర్లు కొడుతున్నాయి. 1987లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు బాలకృష్ణ, శ్రీదేవితో సామ్రాట్ అనే సినిమా అనౌన్స్మెంట్ జరిగింది. తర్వాత 1989 లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో భలే దొంగ సినిమా విషయంలో హీరోయిన్ గా శ్రీదేవిని అనుకున్నారు.

కానీ హిందీలో ఆమె బిజీ షెడ్యూల్ వల్ల ఈ రెండు సినిమాల్లో నటించే అవకాశం రాలేదు. రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, అనురాగ దేవత ఈ రెండు సినిమాల్లో ఒకే ఫ్రేమ్ లో బాలకృష్ణ శ్రీదేవి కనిపించినప్పటికీ ఇద్దరూ ఒకే జోడిగా మాత్రం ఏ సినిమాలో కనిపించలేదు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago