అలా కాకతాళీయంగా జరుగుతుందో లేక కథానాయికల అభినయమో.. మొత్తానికి ఈ హీరో ఏ హీరోయిన్ తో నటించిన ఆమే భవిష్యత్తులో సినీ పరిశ్రమలో ఒక గొప్ప స్టార్ గా ఎదుగుతుంది. 1976 లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరిసిరిమువ్వ సినిమాలో చంద్రమోహన్, జయప్రద జంటగా నటించారు. ఈ సినిమా ఒక కళాత్మక సినిమాగా పేర్కొనవచ్చు. సిరిసిరిమువ్వ తర్వాత 1977లో జయప్రద తన సినీ భవిష్యత్ ను మార్చే జాక్ పాట్ కొట్టేసింది. ఈ సంవత్సరం జయప్రద ఎన్టీఆర్ తో రెండు సినిమాలు చేసే అవకాశం వచ్చింది. 1అడవి రాముడు. 2.యమగోల ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి.
శ్రీదేవి తెలుగులో అనురాగాలు అనే సినిమాలో హీరోయిన్ గా వెండితెరపై కనిపించింది. 1978 లో వచ్చిన పదహారేళ్ళ వయసు సినిమాలో చంద్రమోహన్ శ్రీదేవి జంటగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అవగా ఆ తర్వాత శ్రీదేవి.. వేటగాడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, ప్రేమాభిషేకం, బెబ్బులిపులి లాంటి ఘనవిజయాలతో తెలుగు లోనే కాదు బాలీవుడ్ లో కూడా గొప్ప స్టార్ గా వెలుగొందింది.
1978లో వచ్చిన ప్రాణం ఖరీదు సినిమాలో చంద్రమోహన్ జయసుధ కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత కలియుగ స్త్రీ, సాక్షి, వింత కోడళ్ళు, శ్రీమతి ఒక బహుమతి, నిండు నూరేళ్లు, ఆక్రందన, ఇంటింటి రామాయణం, కలికాలం లాంటి అనేక చిత్రాల్లో ఈ ఇద్దరు జతకట్టారు. ఆ తర్వాత జయసుధ తిరుగులేని నటిగా గా తెలుగు పరిశ్రమలో వెలుగొందారు.
1983లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో చంద్రమోహన్, విజయశాంతి కలిసి నటించారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో 1986లో వచ్చిన ప్రతిఘటన సినిమా ఏకంగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విజయశాంతి ఎన్.టి.రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా అనేక హీరోలతో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. శ్రీదేవి తర్వాత అంతటి స్టార్ డమ్ విజయశాంతి సొంతం చేసుకుంది. చంద్రమోహన్ తో నటించిన అనేక మంది హీరోయిన్స్ టాలీవుడ్, బాలీవుడ్ లో టాప్ స్టార్ గా వెలుగొందిన ఎందుకనో చంద్రమోహన్ మాత్రం పెద్ద స్టార్ గా ఎదగలేకపోయారు
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…