NTR -ANR: తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలు స్వర్గీయ నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు గారి సినీ చరిత్ర ఎలాంటిదో మనకు తెలిసిందే.అక్కినేని నాగేశ్వరరావు చిత్ర పరిశ్రమలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అయితే నందమూరి తారక రామారావు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తనకంటూ ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇకపోతే గత కొద్దిరోజులుగా అక్కినేని నందమూరి వివాదం కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ వివాదం పై స్పందించిన బాలకృష్ణ తాను ఉద్దేశపూర్వకంగా అనలేదని చెప్పినప్పటికీ మరొక కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. అక్కినేని వివాదం పై స్పందించిన బాలకృష్ణ ఏఎన్ఆర్ గారు తన పిల్లలతో కన్నా నాతోనే మంచిగా ఉండేవారు ఆయనకు అక్కడ ప్రేమ లేదు అంటూ వ్యాఖ్యానించారు.
ఇలా బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలతో మరో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది దీంతో అక్కినేని ఎన్టీఆర్ వారసులలో ఎవరు వారసులు బాగా చూసుకున్నారు చివరి వరకు ఎవరు సంతోషంగా ఉన్నారనే ప్రశ్నలను తెరపైకి తీసుకువచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు చివరి రోజులలో వరకు తన కుటుంబంతోను పిల్లలతో కలిసి సంతోషంగా ఉన్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం చివరి క్షణాలలో ఒంటరి అయ్యి ఎంతో మానసిక క్షోభను అనుభవించారు.
ఏఎన్ఆర్ కుటుంబంలో ప్రతి ఒక్కరి మధ్య ప్రేమానురాగాలు ఆప్యాయతలు ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ కుటుంబంలో రాజకీయం తప్ప మరేదీ లేదని కేవలం రాజకీయాల కోసం వెన్నుపోటు పొడిచిన బావ చెంత చేరి కన్నతండ్రిని కూడా దూరం పెట్టిన ఘనత నందమూరి ఫ్యామిలీది అంటూ అక్కినేని అభిమానులు ఈ విషయం పై స్పందించారు. ఎన్టీఆర్ గారికి చివరి రోజులలో తిండి కూడా పెట్టకుండా ఆయనని ఒంటరి చేసి చాలా మానసికంగా ఇబ్బంది పెట్టారంటూ అక్కినేని అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…