NTR: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు వారి సినిమాల విషయంలో కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. ఇలా పలువురు హీరోల సినిమాలలో చాలామంది కొన్ని హిట్ సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు అయితే ఎన్టీఆర్ విషయంలో కూడా ఇలాంటి ఒక హిట్ సెంటిమెంట్ ఉందని తెలుస్తుంది.ఇండస్ట్రీలో డిజాస్టర్ దర్శకులుగా పేరు సంపాదించుకున్న వారి తదుపరి సినిమాలో కనుక ఎన్టీఆర్ నటిస్తే ఆ సినిమా హిట్ అవుతుందన్న సెంటిమెంట్ ఇండస్ట్రీలో కొనసాగుతుంది.
ఇప్పటికే ఎన్టీఆర్ ఈ విధంగా ఐదుగురు ఫ్లాప్ డైరెక్టర్లకు సినిమా అవకాశాలను ఇచ్చి ఐదు సార్లు బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే ప్రస్తుతం కొరటాల శివ కూడా ఆచార్య సినిమాతో డిజాస్టర్ డైరెక్టర్ గా పేరు పొందారు దీంతో ఈయన కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీంతో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అభిమానులు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరి ఎన్టీఆర్ అవకాశం ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన ఐదుగురు ఫ్లాప్ డైరెక్టర్లు ఎవరు అనే విషయానికి వస్తే…
వంశీ పైడిపల్లి మున్నా సినిమాతో డిజాస్టర్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బృందావనం సినిమా చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.సుకుమార్ మహేష్ వన్ నేనొక్కడినే సినిమా ద్వారా డిజాస్టర్ అందుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా అవకాశం కల్పించి హిట్ కొట్టారు. ఇక వరుస ఫ్లాప్ సినిమాలతో ఎంతో ఇబ్బందులలో ఉన్నటువంటి పూరికి టెంపర్ అవకాశమిచ్చి బ్లాక్ బస్టర్ కొట్టారు.
అజ్ఞాతవాసి వంటి సినిమా ద్వారా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా ద్వారా హిట్ కొట్టారు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు డైరెక్షన్ చేసి డిజాస్టర్ అందుకున్నటువంటి డైరెక్టర్ బాబీకి జై లవకుశ సినిమా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఈ క్రమంలోనే ఆచార్య డిజాస్టర్ తో బాధపడుతున్నటువంటి కొరటాలకు దేవర అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కూడా హిట్టేనని మరోసారి హిట్ సెంటిమెంట్ రిపీట్ కాబోతుందని అభిమానులు భావిస్తున్నారు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…