Movie News

ఎన్టీఆర్ తలకు పెద్దగాయం.. దీనిపై రాజమౌళి ఏమన్నారో తెలుసా ?

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం ఉక్రెయిన్‌లో ల్యాండ్ అయింది. బాహుబలి లాంటి అద్భుతం తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, రామ్‌ చరణ్‌ – ఎన్టీఆర్‌లాంటి అగ్ర హీరోలు నటిస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడ లేని అంచనాలు పెరిగాయి.

అయితే దర్శకుడు తరచూ ఈ మూవీ నుంచి కొత్త అప్‌డేట్స్‌ విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాడు. షూటింగ్‌ గ్యాప్‌లో రాజమౌళి తన హీరోలతో సరదాగా గడిపిన సమయాన్ని వీడియో తీసి అభిమానులతో పంచుకున్నారు. వాళ్లు పిట్ట గోడపై కూర్చొని మాట్లాడుతుండగా.. డమ్మీ కెమెరాతో షూట్ చేస్తూ రాజమౌళి కనిపిస్తాడు.

దీనిలో తారక్ కనుబొమ్మపై ఓ గాయం అయినట్లు కనిపించింది. దీంతో ఖంగారు పడ్డ ఆయన అభిమానులు.. ఎన్టీఆర్‌కు ఏమైంది? అంటూ కామెంట్లు పెట్టడం ప్రారంభించారు. ‘ఏమైంది అన్న, ఏం జరిగింది’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీనిపై చిత్ర యూనిట్ స్పందించింది. అది నిజమైన గాయం కాదని.. షూటింగ్‌లో భాగంగా పెట్టిన గాయమని క్లారిటీ ఇచ్చింది. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సందర్బంగా వాళ్లు బ్రహ్మానందం రియాక్షన్‌కు సంబంధించిన జిప్ ఫైల్ ను షేర్ చేశారు. మేకింగ్‌ వీడియాతో పాటు ఇటీవలె దోస్తీ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 13న ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago