రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీం ఉక్రెయిన్‌లో ల్యాండ్ అయింది. బాహుబలి లాంటి అద్భుతం తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, రామ్ చరణ్ – ఎన్టీఆర్‌లాంటి అగ్ర హీరోలు నటిస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడ లేని అంచనాలు పెరిగాయి.

అయితే దర్శకుడు తరచూ ఈ మూవీ నుంచి కొత్త అప్‌డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాడు. షూటింగ్ గ్యాప్‌లో రాజమౌళి తన హీరోలతో సరదాగా గడిపిన సమయాన్ని వీడియో తీసి అభిమానులతో పంచుకున్నారు. వాళ్లు పిట్ట గోడపై కూర్చొని మాట్లాడుతుండగా.. డమ్మీ కెమెరాతో షూట్ చేస్తూ రాజమౌళి కనిపిస్తాడు.
దీనిలో తారక్ కనుబొమ్మపై ఓ గాయం అయినట్లు కనిపించింది. దీంతో ఖంగారు పడ్డ ఆయన అభిమానులు.. ఎన్టీఆర్‌కు ఏమైంది? అంటూ కామెంట్లు పెట్టడం ప్రారంభించారు. ‘ఏమైంది అన్న, ఏం జరిగింది’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీనిపై చిత్ర యూనిట్ స్పందించింది. అది నిజమైన గాయం కాదని.. షూటింగ్‌లో భాగంగా పెట్టిన గాయమని క్లారిటీ ఇచ్చింది. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సందర్బంగా వాళ్లు బ్రహ్మానందం రియాక్షన్‌కు సంబంధించిన జిప్ ఫైల్ ను షేర్ చేశారు. మేకింగ్ వీడియాతో పాటు ఇటీవలె దోస్తీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 13న ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


































