NTR -Hrithik Roshan: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమాలలో కూడా నటించడానికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే హృతిక్ రోషన్ నటిస్తున్నటువంటి సినిమాలో ఈయన ఆయనతో తలపడుతున్నట్లు సమాచారం. హృతిక్ రోషన్ హీరోగా టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం వార్.ఈ సినిమా 2019 వ సంవత్సరంలో విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా విడుదల సమయంలోనే తప్పనిసరిగా ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ తెలియజేసిన విషయం మనకు తెలిసిందే.
అయితే ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆలస్యం మొత్తం వస్తుంది.తాజాగా ఈ సినిమా సీక్వెల్ చిత్రానికి అడుగులు పడినట్టు తెలుస్తోంది.ఇక వార్ సినిమాకి సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించక ఈ సినిమా సీక్వెల్ చిత్రం నికి మాత్రం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని సమాచారం. ఇలా ఈ విషయం తెలియడంతో ఇటు నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కదా అసలు సిసలైన వార్ అంటే అంటూ ఈ విషయంపై నందమూరి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా తెలుగు ప్రమోషన్ కార్యక్రమాలలో ఎన్టీఆర్ పాల్గొన్న విషయం మనకు తెలిసిందే అయితే ఆ సమయంలోనే ఎన్టీఆర్ వార్ 2 లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…