Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే .ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి భాగం అక్టోబర్ 10 వ తేదీ విడుదల కాబోతోంది. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కావలసి ఉండగా షూటింగ్ కాస్త ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడింది.
ఇక ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీ విడుదల కాబోతుందన్న విషయం తెలియడంతో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ అభిమానులకు కాస్త ఊరటని కలిగించాయి. ఎన్టీఆర్ ఇటీవల సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా మంచి సక్సెస్ కావడంతో సక్సెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ దేవర సినిమా గురించి మాట్లాడారు. దేవర సినిమా ఒక భయం అనే కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమా విడుదల విషయం గురించి మాట్లాడుతూ సినిమా విడుదల కాస్త ఆలస్యం కావచ్చు ఏమో కానీ విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరు కాలర్ ఎగరేస్తారని తెలిపారు.
భయం అనే కాన్సెప్ట్..
ప్రతి ఒక్క అభిమాని కాలర్ ఎగరేసే విధంగా సినిమా ఉండాలని తాము కష్టపడుతున్నాము అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసినటువంటి ఈ కామెంట్స్ అభిమానులకు సంతోషాన్ని కలిగించాయి. ప్రస్తుతం ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ కావడంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…