NTR: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీలో కొనసాగే హీరోలు దర్శకులు ఒకవైపు వారి వృత్తిపరమైన జీవితంలో కొనసాగుతూనే మరోవైపు నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెడుతున్న విషయం మనకు తెలిసిందే.ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ఇప్పటికే నిర్మాతలుగా మారి నిర్మాణ రంగంలో కూడా మంచి సక్సెస్ సాధించారు.
ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.ఇలా ఈ నిర్మాణ సంస్థ ద్వారా ఎంతో మంది టాలెంట్ కలిగి ఉన్నటువంటి కొత్త దర్శకులకు హీరో హీరోయిన్లకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ హౌస్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయని త్వరలోనే ఈ విషయాన్ని తెలియజేయబోతున్నట్టు సమాచారం.
ఇండస్ట్రీలో రాంచరణ్, కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ, నాని వంటి హీరోలందరూ కూడా నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోని ఎన్టీఆర్ సైతం సరికొత్త బ్యానర్ ఏర్పాటు చేయబోతున్నారు.అయితే ఈ బ్యానర్ ద్వారా తన అన్నయ్య కళ్యాణ్ రామ్ తరహాలోని కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వబోతున్నారట.
ఇకపోతే ఎన్టీఆర్ ప్రారంభించబోయే ఈ కొత్త బ్యానర్ లో ఈయన మొట్టమొదటి సినిమాని ఏ హీరోతో చేయబోతున్నారు అనే విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన తన బానర్లో మొదటి సినిమాని నాచురల్ స్టార్ నానితో ఫస్ట్ సినిమా చేయాలని తారక్ భావించారన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరి త్వరలోనే ఈ నిర్మాణ సంస్థ గురించి పూర్తి వివరాలను అధికారకంగా తెలియజేయబోతున్నారని సమాచారం.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…