Om Rauth: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి చిత్రం ఆది పురుష్. ఈ సినిమా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో తిరుపతిలో నిన్న సాయంత్రం ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం తిరుపతిలో పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇకపోతే ఈ సినిమా వేడుక అనంతరం చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక నేడు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం బయటకు వచ్చారు ఆలయం బయటకు వచ్చిన తర్వాత కృతి సనన్ కి ఫ్లైట్ టైం అవుతుండడంతో ఆమెకు సెండ్ ఆఫ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో డైరెక్టర్ ఓం రౌత్ తనని హగ్ చేసుకుని తన బుగ్గపై ముద్దు పెట్టారు.
ఇలా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్లకి ఇలాంటివన్నీ చాలా సర్వసాధారణమైనవే అయితే వారు ఒక పవిత్రమైన కొండపై ఉన్నారన్న విషయాన్ని మరిచిపోయి ఇలా తనకు ముద్దులు పెట్టడం పట్ల భక్తులు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైనటువంటి శ్రీవారి సన్నిధిలో ఇలాంటి పనులు చేయడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే మరికొందరు ఈ ఘటనపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ వ్యవహార శైలి పై మండిపడుతున్నారు.సెలబ్రిటీలకు ఇలాంటివన్నీ సర్వసాధారణం కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని వ్యవహరించాల్సింది కనీసం ఆ జ్ఞానం కూడా లేకపోతే ఎలా అంటూ మండిపడుతున్నారు. మరి ఈ వ్యవహారంపై డైరెక్టర్ లేదా నటి కృతి సనన్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…