Orange Movie: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎంతో మంది హీరోల సినిమాలు విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి.ఈ క్రమంలోనే రామ్ చరణ్ హీరోగా నటించిన ఆరెంజ్ సినిమా తిరిగి ఆయన పుట్టిన రోజు సందర్భంగా మూడు రోజులపాటు థియేటర్లలో సందడి చేసింది.
ఇక ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా రాంచరణ్ జెనీలియా జంటగా నటించారు. నాగబాబు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా 2010 వ సంవత్సరంలో విడుదలయ్యి డిజాస్టర్ గా మిగిలింది.అప్పట్లో ఈ సినిమా నిర్మాత నాగబాబుకు భారీ నష్టాలను తీసుకువచ్చింది.ఇకపోతే చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని తిరిగి విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన రావడంతో దర్శక నిర్మాతలు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇలా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ రావడంతో దర్శక నిర్మాతలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా రీ రిలీజ్ కలెక్షన్లన్నీ కూడా జనసేన పార్టీకి విరాళంగా అందజేస్తామని నాగబాబు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇక మూడు రోజులు పాటు థియేటర్లలో సందడి చేసి భారీ కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తుంది.
ఆరెంజ్ సినిమా మూడు రోజుల పాటు ప్రదర్శితమవుతూ ఏకంగా మూడు కోట్ల రూపాయలను సాధించింది అంటూ నాగబాబు ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేశారు. ఇలా ఒకప్పుడు డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు అద్భుతమైన కలెక్షన్లను రాబట్టడంతో అభిమానుల సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…